Nagababu Viral Tweet On Nara Lokesh: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రుత్వం కూడా ఉండదు. అయితే ఒక పార్టీలో ఉంటే మరో పార్టీ నేతను ప్రశంసించడం చాలా అరుదైన విషయం. రాజకీయాల్లో కొద్ది సందర్భాల్లో అది కనిపిస్తుంది. అటువంటిదే తాజాగా ఏపీలో కనిపించడం విశేషం. తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి నారా లోకేష్ పై.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసలు కురిపించారు. తెలుగుదేశం పార్టీ నుంచి నాయకుడు ఉద్భవిస్తున్నాడని నారా లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని.. ఏపీకి సీఎంగా లోకేష్ బాధ్యతలు స్వీకరిస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం నడుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందేనని వైసీపీ కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే నారా లోకేష్ ను ప్రశంసిస్తూ నాగబాబు ట్వీట్ చేయడం ఆకర్షిస్తోంది.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
* పాఠశాలలో జరిగిన ఘటనపై..
ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో( social media) వైరల్ అయింది. అయితే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ దానికి బాధ్యత వహిస్తూ క్షమించండి అంటూ స్పందించడం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం బాగాలేదని.. విద్యార్థులు భోజనాన్ని చెత్తబుట్టలో వేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు క్షమాపణలు కోరారు. వెంటనే హెచ్ఎం పై సస్పెన్షన్ వేటు వేశారు. మధ్యాహ్నం భోజనం తయారు చేసే ఏజెన్సీని మార్చారు. మధ్యాహ్న భోజన పథకం పై పర్యవేక్షణ పెంచుతామని.. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. తద్వారా సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తామంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
* మధ్యాహ్న భోజన పథకంలో..
వాస్తవానికి మధ్యాహ్నం భోజన పథకంలో వినూత్న మార్పులు చేశారు. నాణ్యమైన బియ్యంతో అన్నం, ఇతర ఆహార పదార్థాల మెనూను సక్రమంగా పాటిస్తున్నారు. అయితే అది పాఠశాల తప్పిదం అయినా నారా లోకేష్ బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పారు. అయితే మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ నాగబాబు పోస్ట్ పెట్టారు. మధ్యాహ్నం భోజనంలో పొరపాటు జరిగితే.. అది ఆ పాఠశాల తప్పు అయినప్పటికీ మంత్రి లోకేష్ బాధ్యత తీసుకున్నారని ప్రశంసించారు. టిడిపి నుంచి బాధ్యతాయుతమైన నాయకుడు ఉద్భవిస్తున్నాడు అంటూ పేర్కొన్నారు ఆ ట్వీట్ లో.. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
* ట్వీట్ సారాంశం ఇదే.. నాగబాబు( Nagababu ) చేసిన ఈ ట్వీట్ ఇలా ఉంది. ” మైలవరంలోని తారక రామా నగర్ మండల పరిషత్ మోడల్ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకంలో.. ఒక పొరపాటు జరిగింది. అది పాఠశాల తప్పిదమే అయినప్పటికీ.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. నిజమైన బాధ్యతను చూపిస్తున్నారు. ఇది శ్రద్ధ వహించే నాయకుడి లక్షణం. టిడిపి నుంచి బాధ్యతాయుతమైన నాయకుడు ఉద్భవిస్తున్నాడు ” అంటూ తన ట్విట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A mistake happened in the Dokka Seethamma mid-day meals at Tarakarama Nagar Mandal Parishath Model School, Mylavaram. Though it was the school’s error, Education Minister Sri Nara Lokesh still apologised
showing true responsibility. This is the mark of a leader who cares. A… https://t.co/3ue8LwaigW— Naga Babu Konidela (@NagaBabuOffl) March 14, 2026
