Nara Lokesh : నారా లోకేష్ ( Nara Lokesh) తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన రాజకీయ ఎంట్రీని అపహాస్యం చేశారు ప్రత్యర్ధులు. 2019లో మంత్రిగా ఉంటూ ఓడిపోయేసరికి అవహేళన చేశారు. గత ఐదేళ్లలో అనేక రకాల ముద్రవేశారు. రాజకీయాలకు పనికిరాడు అంటూ విశ్లేషణలు కూడా చేశారు. అయితే వాటన్నింటిని అధిగమించారు నారా లోకేష్. గత ఐదేళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో నారా లోకేష్ అరెస్ట్ అవుతారని కూడా ప్రచారం నడిచింది. కానీ చంద్రబాబు అరెస్టుతో అది ఆగింది. అయితే ఒకవైపు పార్టీని నడిపిస్తూ.. తండ్రిని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు లోకేష్ పడిన తపన అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రమంలో కేంద్ర పెద్దలతో ఆయన మరింత దగ్గరయ్యారు. టిడిపి, బిజెపి పొత్తునకు తన వంతు కృషి చేశారు.
Also Read : తక్కువ సమయంలో రెట్టింపు లాభం ఆశ చూపిన నటుడు.. చివరకు చీటింగ్!
* అప్పట్లో బీజేపీ పెద్దల అభ్యంతరాలు..
ఏపీలో నారా లోకేష్ విషయంలో బిజెపి పెద్దల( BJP High Command leaders ) అభ్యంతరాలు ఉన్నట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. వారసత్వ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకమని.. ఈ విషయంలో లోకేష్ కు మినహాయింపు ఇవ్వరని కూడా టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అదే లోకేష్ కేంద్ర పెద్దలకు అత్యంత దగ్గర కావడం విశేషం. ప్రధాని మోదీ తో పాటు హోం మంత్రి అమిత్ షా లోకేష్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. గతం మాదిరిగా కాకుండా లోకేష్ విషయంలో మినహాయింపులు ఇస్తున్నారు. తాజాగా నారా లోకేష్ హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా తో సన్నిహితంగా ఉండడం విశేషం.
* ఇద్దరి మధ్య మంచి సంబంధాలు..
ఐసీసీ చైర్మన్ గా( ICC chairman) ఉన్న జై షా తో( Jai Shah) నారా లోకేష్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. విశాఖలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు జై షా ప్రత్యేకంగా వచ్చారు. నారా లోకేష్ ఈ మ్యాచ్ కోసం ఆయనను వచ్చేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే ప్రతి చోటకు షా వెళ్లరు. కానీ విశాఖ రావడం వెనుక లోకేష్ ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తర్వాత లోకేష్ తో జై షా ప్రత్యేకంగా డిన్నర్ కూడా చేశారు. కొద్దిరోజుల కిందట ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కు జై షా నారా లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అప్పట్లో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ హైలెట్ అయింది. ఇప్పుడు విశాఖలో వారు మరింత సన్నిహితంగా తిరగడం కనిపించింది.
* ప్రపంచ క్రికెట్ దిగ్గజం
వాస్తవానికి అమిత్ షా( Amit Shah) కుమారుడుగా జై షా దేశవ్యాప్తంగా సుపరిచితం. కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కేవలం క్రికెట్ వ్యవహారాలకు తీసుకుంటారు. ఐసీసీ చైర్మన్గా ఉన్న ఆయనకు బీసీసీఐ లోను మంచి పట్టు ఉంది. అందుకే క్రికెట్ పరంగా ఏపీని మరింత అభివృద్ధి చేయాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి జై షా సాకారం లోకేష్ కోరినట్లు తెలుస్తోంది. త్వరలో క్రికెట్ పరంగా భారీ స్థాయిలో ప్రాజెక్టులు ఏపీకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : తల్లి లేదు.. మేనమామే అన్నీ.. కన్నీళ్లు తెప్పిస్తున్న అనికేత్ వర్మ స్టోరీ!