https://oktelugu.com/

Digital media : డిజిటల్ మీడియాను ఓన్ చేసుకునేలా నారా లోకేష్ పెద్ద ప్లాన్లు.. ఎలా ముందుకెళ్తున్నారంటే?

మనం అనేక సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం కదా.. ప్రింట్ మీడియాకు రోజులు లేవని.. ఎలక్ట్రానిక్ మీడియాను దేకే సందర్భాలు మాయమయ్యాయని.. ఈ విషయాన్ని గుర్తించారేమో.. ఏపీ మంత్రి నారా లోకేష్ డిజిటల్ మీడియా వైపు ఫోకస్ పెట్టారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 12, 2024 / 07:30 PM IST

    Nara Lokesh 

    Follow us on

    Digital media : గత ఎన్నికల్లో డిజిటల్ మీడియాను ఉపయోగించి వైసిపి తప్పిదాలను టిడిపి వ్యూహాత్మకంగా ప్రజల ముందు పెట్టింది. అది టిడిపికి విపరీతమైన మైలేజ్ తెచ్చిపెట్టింది. దీంతో తెలుగుదేశం పార్టీ కూటమిలో కీలకంగా మారింది. ఆ తర్వాత వివిధ డిజిటల్ వేదికల మీద నారా లోకేష్ తనదైన వాణి వినిపించారు. జాఫర్, ప్రేమ లాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అసలు ఇది యూట్యూబ్ కాలం కావడంతో.. ఆ ఇంటర్వ్యూలు బాగా పేలాయి. జనాల్లోకి మరింతగా వెళ్లాయి. దీంతో నారా లోకేష్ గురించి ప్రజలకు మరింతగా అర్థమైంది. ఫలితంగా ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడానికి ఊతం దొరికింది. ఇక వెబ్ సైట్లు కూడా నారా లోకేష్ రెడ్ బుక్ గురించి సోదారణంగా రాశాయి. ప్రధాన స్రవంతి మీడియా ఎంత రాసినా రాని మైలేజీ డిజిటల్ మీడియా ద్వారా రావడంతో ఇప్పుడు నారా లోకేష్ దానిమీద బాగా ఫోకస్ చేశారని తెలుస్తోంది. గత ప్రభుత్వం డిజిటల్ మీడియాను వేరే విధంగా వాడుకోవడంతో అది కాస్త దారి తప్పింది. ఫలితంగా ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. అయితే ఆ పార్టీ నేర్పిన పాఠం నేపథ్యంలో డిజిటల్ మీడియాను సానుకూలంగా వాడుకోవాలని.. విమర్శలకు, ఆరోపణలకు, వ్యక్తిగత దూషణలకు కాకుండా…”రైసింగ్ ఆంధ్ర ప్రదేశ్” అనే నినాదాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవాలని నారా లోకేష్ బృందం భావిస్తోంది.

    ఏం చేస్తున్నారంటే..

    విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నారా లోకేష్, ఆయన బృందం డిజిటల్ మీడియాపై దృష్టి సారించింది. సోషల్ మీడియా ఇన్ ప్లూయన్సర్స్, యూ ట్యూబ్ చానెల్స్, వెబ్ సైట్స్ ను కొనుగోలు చేయడం లేదా వారి ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడం.. ఏపీకి ఉన్న అవకాశాలను ప్రస్తావించడం వంటి కార్యక్రమాలను చేపడతారని తెలుస్తోంది. అయితే వీటి ద్వారా ఏపీ ప్రయోజనాలకు పెద్దపీటవేసి.. ప్రజల్లో ప్రభుత్వంపై మరింత సానుకూల దృక్పథాన్ని కలిగించేలా చేస్తారని సమాచారం. ఇప్పటికే నారా లోకేష్ బృందం వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. అవకాశం ఉంటే డిజిటల్ మీడియాలో పేరుపొందిన సంస్థలను కొనుగోలు చేయడం లేదా అందులో పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కుదరకపోతే వారి వ్యాపార విస్తరణకు ప్రోత్సాహకాలు అందించి.. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయిస్తారని తెలుస్తోంది. అయితే డిజిటల్ మీడియాను అక్రమమైన పనులకు ఉపయోగించుకోకుండా.. సానుకూల దృక్పథాన్ని పెంపొందించే పనుల కోసమే వినియోగించుకోవాలని నారా లోకేష్, ఆయన బృందం భావిస్తోంది. డిజిటల్ మీడియా విస్తృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. నారా లోకేష్ బృందం ఈ నిర్ణయం తీసుకుందని.. డిజిటల్ మీడియాను బలోపేతం చేయడం ద్వారా 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలని లోకేష్ బృందం భావిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు మొదలయ్యాయని.. కొద్దిరోజులు గడిస్తే ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.