https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : సోషల్ మీడియాలో K బ్యాచ్ అనే ప్రచారం బిగ్ బాస్ విజేతని మార్చేయబోతోందా ?

ముఖ్యంగా ప్రతీ ఒక్కరిలో మన తెలుగోడిని గెలిపించుకోవాలి అనే కసి వచ్చింది. చూడాలి మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏవైనా అనూహ్య మార్పులు చేర్పులు చోటుచేసుకుంటమో!.

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 07:18 PM IST

    Bigg Boss 8 telugu

    Follow us on

    Bigg Boss 8 Telugu : ప్రతీ బిగ్ బాస్ సీజన్ కి టైటిల్ విన్నర్ ఎవరో మనకి నాలుగు వారాల తర్వాత సోషల్ మీడియా పోల్స్ ద్వారానే అర్థమైపోతుంది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం 11 వ వారం వరకు కష్టమైపోయింది. మొదటి వారం నుండి నిఖిల్ టాప్ లీడింగ్ లో ఉంటూ వచ్చాడు. అతనికి పోటీ గా ఓటింగ్ లో నువ్వా నేనా అనే విధంగా నభీల్ వచ్చాడు. టైటిల్ విన్నర్ వీళ్లిద్దరి మధ్యలోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. మధ్యలో మణికంఠ కి ఫాలోయింగ్ బాగా పెరుగుతుండడంతో ఇతనికి కూడా టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అతను తనకి తాను సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ కి ముందు, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ తర్వాత అన్నట్టుగా మారిపోయింది.

    వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాకపొయ్యుంటే ఈ సీజన్ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యుండేది అని విశ్లేషకులు సైతం సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. బాగా పరిశీలించి చూస్తే అదే నిజమని అనిపిస్తుంది. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వంటి వారు వచ్చిన తర్వాత హౌస్ లో బోలెడంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, కేవలం వీళ్ళ కామెడీ కోసం షోని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే విధంగా గత సీజన్ లో 13 వారాలు హౌస్ లో కొనసాగిన గౌతమ్ కృష్ణ, ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి గేమ్ ని మొత్తం మార్చేశాడు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. మణికంఠ మీద యష్మీ, ప్రేరణ, పృథ్వి, నిఖిల్(K బ్యాచ్) వంటి వారు చీటికీ మాటికీ అరుస్తుండడం, అతని పట్ల చాలా పొగరుగా ప్రవర్తించడం వంటివి చూసినప్పటి నుండి సోషల్ మీడియా లో K బ్యాచ్ మన తెలుగు కంటెస్టెంట్స్ ని టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నారు అనే వాదన బలంగా మొదలైంది.

    ఇక గౌతమ్ వచ్చిన తర్వాత ఆ వాదన తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే విన్నర్ ని నిర్ణయించే రేంజ్ లో అన్నమాట. నిన్న మొన్నటి వరకు నిఖిల్ టైటిల్ కొట్టబోతున్నాడు అని అందరూ బలంగా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కానీ గత రెండు వారాల నుండి గౌతమ్ దూసుకొచ్చేసాడు. ఇతనికి రోజురోజుకి పెరుగుతున్న గ్రాఫ్ ని చూస్తుంటే కచ్చితంగా టైటిల్ కొట్టేస్తాడు అనిపిస్తుంది. నిఖిల్, యష్మీ, ప్రేరణ వంటి వారు గౌతమ్ పై మితిమీరిన ద్వేషం, అసూయ చూపించడం, అతన్ని ప్రతీ విషయంలో తక్కువ చేసి మాట్లాడడం వంటివి ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. అందరితో రేలంగి మావయ్య లాగా ఎంతో సౌమ్యంగా వ్యవహరించే నిఖిల్ ముసుగు కూడా గౌతమ్ వల్ల తొలగిపోయింది. వాటర్ ట్యాంక్స్ టాస్కులో గౌతమ్ మీద ఉక్రోషంతో నిఖిల్ ప్రవర్తించిన తీరుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

    అదే విధంగా ప్రేమ పేరుతో గౌతమ్ ని వాడుకొని నిఖిల్ ని తన దారిలోకి తెచ్చుకునేలా ప్రయత్నం చేసిన యష్మీ ని కూడా గౌతమ్ అడ్డంగా బుక్ చేసేసాడు. ముఖ్యంగా ఆయన యష్మీ ని ‘అక్కా’ అని సంబోధించడం ఆమెకి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. K బ్యాచ్ కి మన తెలుగోడు గౌతమ్ చుక్కలు చూపిస్తున్నాడు అనేది ఇక్కడి నుండే మొదలైంది. అందుకే అతని గ్రాఫ్ ఊహకందని రేంజ్ కి వెళ్ళిపోయింది. హౌస్ లోకి వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యి, మణికంఠ కారణంగా సేఫ్ అయిన గౌతమ్ ఇంత దూరం వచ్చాడంటే, కచ్చితంగా అతని అద్భుతమైన ఆట తీరుతో పాటు, K బ్యాచ్ అనే సోషల్ మీడియా నినాదం కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు. యష్మీ, నిఖిల్ ముసుగులను, వాళ్ళిద్దరి నిజస్వరూపాలను బయటకి తీసి ఆడియన్స్ కి చూపించిన గౌతమ్, ఈ వారం ప్రేరణ ముసుగు కూడా తీసేసాడు. ఇలా K గ్యాంగ్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురి ముసుగులను బయటకి తియ్యడంతో గౌతమ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా ప్రతీ ఒక్కరిలో మన తెలుగోడిని గెలిపించుకోవాలి అనే కసి వచ్చింది. చూడాలి మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏవైనా అనూహ్య మార్పులు చేర్పులు చోటుచేసుకుంటమో!.