https://oktelugu.com/

Kanguva Premier Talk : వైరల్ అవుతున్న సూర్య ‘కంగువ’ దుబాయి ప్రీమియర్ షో టాక్..సినిమా ఏ రేంజ్ లో ఉందంటే!

ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి దుబాయి లో వచ్చిన ఈ టాక్ ఎంత వరకు నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 08:03 PM IST

    What is Kangua's release trailer like? Will this movie be a hit?

    Follow us on

    Kanguva Premier Talk :  మన సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో బలమైన మార్కెట్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే ఈయన్ని తమ సొంత హీరోగా భావిస్తారు. ఒకానొక సమయంలో సూర్య తెలుగు హీరో అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే స్థాయి అభిమానం ఆయనకీ తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ గడిచిన కొన్నేళ్ల నుండి సూర్య కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు పడుతున్నాయి. ఈయన తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన శివ కార్తికేయన్ వంటి చిన్న హీరోలు కూడా ఇప్పుడు స్టార్స్ అయిపోయారు. కానీ సూర్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఇంకా 2017 కాలం నాటి మార్కెట్ దగ్గరే ఆగిపోయాడు. ఆయన తమ్ముడు కార్తీ కూడా సూర్య ని దాటేశాడు.

    అభిమానులందరూ ఆయన నుండి బలమైన బ్లాక్ బస్టర్ కావాలని కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే సూర్య మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని ‘కంగువ’ వంటి భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రంతో మరో రెండు రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, థియేట్రికల్ ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ ని మనమంతా చూసాము. మోడరన్ యుగం లో ఉండే సూర్య క్యారక్టర్, వందల సంవత్సరాల కాలానికి చెందిన అడవి వీరుడిగా మరో సూర్య క్యారక్టర్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. క్వాలిటీ కూడా అదిరిపోయింది అనే టాక్ వచ్చింది. కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. బుకింగ్స్ ట్రెండ్ ఎలా ఉంది అనేది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో దుబాయి లో కొంతమంది ముఖ్యమైన మీడియా ప్రతినిధులకు వేసి చూపించారు.

    ఈ చిత్రాన్ని చూసిన తర్వాత వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ప్రారంభం లో స్క్రీన్ ప్లే కాస్త స్లో గానే మొదలైనప్పటికీ, 20 నిమిషాల తర్వాత కథ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుందట. ఫస్ట్ హాఫ్ మొత్తం లోపాలు ఎంత వెతికినా కనపడవట. అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి కలిగించే విధంగా ఈ సినిమా ఉంటుందని దుబాయి ప్రీమియర్ షో నుండి టాక్ వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోతాయట. అసలు ఇలాంటి ఆలోచన డైరెక్టర్ కి ఎలా వచ్చింది అని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కి మించి ఉంటుందట, సూర్య కెరీర్ లో ఇలాంటి సాలిడ్ చిత్రం పడి చాలా కాలం అయ్యిందని, కచ్చితంగా ఈ సినిమా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి దుబాయి లో వచ్చిన ఈ టాక్ ఎంత వరకు నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.