spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh apology midday meal issue: ప్రతిపక్షాల కుట్ర అన్న మాట లేకుండా.. లోకేష్...

Nara Lokesh apology midday meal issue: ప్రతిపక్షాల కుట్ర అన్న మాట లేకుండా.. లోకేష్ పనికి ఫిదా!

Nara Lokesh apology midday meal issue: ప్రస్తుతం హుందా రాజకీయాలు కనిపించవు. ఇప్పుడు అంతా బుకాయింపు. తప్పులకు మంత్రులు బాధ్యత వహించరు. అసలు ప్రజాప్రతినిధులు స్పందించరు. కానీ నారా లోకేష్( Minister Nara Lokesh) ఇందుకు భిన్నం. ఆయనకు సమస్య చెబితే ఇట్టే పరిష్కారం అవుతుందని భావించిన వారు ఉన్నారు. విదేశాల్లో చిక్కుకున్న వారి నుంచి ఏపీలో రాజకీయ ప్రత్యర్థి పార్టీలో కార్యకర్తల వరకు అందరూ లోకేష్ సాయాన్ని పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది. గ్రామీణ రహదారులతో పాటు బస్సు సౌకర్యం కావాలని భావిస్తున్న వారు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియా వేదిక ద్వారా ఆశ్రయిస్తున్నారు. ఇక ఎలాంటి సామాజిక సమస్య అయిన నారా లోకేష్ కు ఎక్కువమంది ఆశ్రయిస్తున్నారు. మొన్న ఆ మధ్యన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరు ఆయన తండ్రి అనారోగ్యం విషయంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నారా లోకేష్ కు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించి తన బృందాన్ని పంపించి సాయం చేశారు. ఒక చిన్నారి ఆపరేషన్కు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసి.. సాయం చేసేందుకు కూడా నారా లోకేష్ ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేవలం సాయం విషయంలోనే కాదు ప్రభుత్వ పరంగా తప్పులు జరిగితే క్షమించమని కోరేందుకు కూడా లోకేష్ వెనుకడుగు వేయడం లేదు. అలా ఒక నాయకుడు క్షమించండి అని కోరడం చిన్న విషయం కాదు.

వీడియో వైరల్..
ఎన్టీఆర్ జిల్లాలో( NTR district) ఒక పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారంటూ అక్కడ విద్యార్థులు భోజనాన్ని చెత్తబుట్టలో పడేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పాఠశాల హెచ్ఎం ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన తప్పిదానికి ఆ పాఠశాల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా క్షమాపణలు తెలియజేశారు. జరిగిన ఘటనకు సంబంధించి విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పాఠశాలకు భోజన కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీ సంస్థకు ఆ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా లీఫ్ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకొని పర్యవేక్షణకు మరింత బలోపేతం చేస్తామంటూ హామీ ఇచ్చారు.

Also Read: ఏపీలో రోహిణి కార్తెలో కష్టమే!

ఆ వైఫల్యాన్ని తప్పించుకోకుండా..
ప్రస్తుతం నారా లోకేష్ మంత్రిగానే కాకుండా యువనేతగా జాతీయస్థాయిలో కూడా గుర్తింపు పొందారు. కానీ ప్రభుత్వ పరంగా పాఠశాలలో జరిగిన తప్పుకు గాను ఆ శాఖ మంత్రిగా తన వంతు బాధ్యతగా చాలా హుందాగా స్పందించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు క్షమాపణలు తెలిపి ప్రజలకు జవాబుదారీగా ఉంటూ రాజకీయాల్లో మరో మెట్టు ఎక్కారు నారా లోకేష్. తన శాఖలో తప్పిదం బయటపడితే అది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పకుండా.. క్షమాపణలు కోరడం అనేది చిన్న విషయం కాదు. అందుకే నారా లోకేష్ మరోసారి అభినందనలు అందుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular