Nara Rohith Engagement : ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట పెళ్లి బాజా మోగనుంది. నారా చంద్రబాబు తమ్ముడి కుమారుడి వివాహ ఎంగేజ్మెంట్ వేడుకఈనెల 13న హైదరాబాదులో జరగనున్నట్లు తెలుస్తోంది.చంద్రబాబుకు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఉన్నారు.తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు.1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.అయితే తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఆయన కుమారుడే నారా రోహిత్.సినిమా రంగంలో అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రోహిత్ కు వివాహం కుదిరినట్లు తెలుస్తోంది. రోహిత్ కంటే పెద్దవాడు శిరీష్ ఉన్నారు. ఆయనకు సైతం వివాహం కాలేదని తెలుస్తోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా రామ్మూర్తి నాయుడు కుమారులు ఇద్దరికీ వివాహాలు జరగలేదనిప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి కలుగజేసుకొని.. హీరో నారా రోహిత్ సంబంధం కుదిర్చినట్లు సమాచారం. ఈనెల 13న వేడుకగా నిర్వహించే ఈ వేడుకలకు సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* అప్పట్లో వ్యతిరేక ప్రచారం
నారా రామ్మూర్తి నాయుడును సోదరుడు చంద్రబాబు పక్కన పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది.నందమూరి కుటుంబంతో పాటు సొంత సోదరుడు రామ్మూర్తినాయుడును చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అప్పట్లో కొడాలి నాని ఆరోపించారు.కానీ అటువంటిదేమీ లేదని రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్ ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు చొరవ తీసుకొని నారా రోహిత్ తో సినీ రంగ ప్రవేశం చేయించారని కూడా అప్పట్లో రాక నడిచింది. అటు నారా రోహిత్ సైతం పెదనాన్న చంద్రబాబు, సోదరుడు లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.
* సరైన బ్రేక్ లేదు
నారా రోహిత్ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి.కానీ ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు.సినీరంగం సైతం ఒడిదుడుకుల మధ్య నడుస్తోంది.ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు నారా రోహిత్.రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో పర్యటించి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు.అయితే కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడంతో సోదరులు ఇద్దరికీ పెళ్లిళ్లు జరగలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో పెద్దమ్మ నారా భువనేశ్వరి చొరవ తీసుకుని.. రోహిత్ పెళ్లి నిశ్చయం చేసినట్లు సమాచారం. కాగా వధువు వివరాలు ఇంకా బయటకు వెల్లడి కాలేదు. కానీ ఈనెల 13న ఎంగేజ్మెంట్ వేడుకలకు మాత్రం ఏర్పాట్లు చకచగా జరుగుతున్నాయి.