Women’s T20 World Cup : శ్రీలంకపై అతి భారీ విజయమే కాదు.. భారత జట్టు అనేక రికార్డులను బద్దలు కొట్టింది.. ఇంతకీ అవి ఏంటంటే..

టి20 క్రికెట్ చరిత్రలోనే భారత మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి శ్రీలంక జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో 82 పరుగుల తేడాతో అతి భారీ విజయాన్ని సాధించింది. నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవాల్సిన తరుణంలో.. శ్రీలంకపై భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Written By: Neelambaram, Updated On : October 10, 2024 11:28 am

Women's T20 World Cup IND VS SL

Follow us on

Women’s T20 World Cup : దుబాయ్ వేదికగా శ్రీలంక జట్టుతో బుధవారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ (52*), స్మృతి (50), షఫాలి(43) ఆకాశమేహద్దుగా చెలరేగిపోవడంతో భారీ స్కోర్ చేసింది. టీమిండియా కెప్టెన్ హర్మన్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు 90 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు ఆశా శోభన, అరుంధతి రెడ్డి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రేణుక ఫ్రెండ్ వికెట్లు సాధించింది. ఈ గెలుపు ద్వారా టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే భారత్ అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది.

అనేక రికార్డులు గల్లంతు

శ్రీలంక పై సాధించిన విజయం నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు అనేక రికార్డులను గల్లంతు చేశారు.. టీమిండియా ఓపెనర్లు స్మృతి, షఫాలి వర్మ 2024 లో ఏడుసార్లు టి20 క్రికెట్లో ఏదైనా వికెట్ కు అత్యధికంగా 50+ కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. వీరి తర్వాత స్థానంలో న్యూజిలాండ్ జట్టుకు చెందిన సుజీ బేట్స్ – సోఫీ డివైన్ కొనసాగుతున్నారు. 2018లో న్యూజిలాండ్ జట్టు తరుపున వీరు ఆరుసార్లు 50+ కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. 2018లో ఆస్ట్రేలియా కు చెందిన అలీసా హీలీ – బీఎల్ మూనీ ఆరుసార్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలను నిర్మించారు.. సౌత్ ఆఫ్రికా కు చెందిన తజ్బిన్ బిట్స్ – లారా 2023లో ఆరు సార్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పారు.. యూఏఈ కి చెందిన కవిష – ఈష జోడి 2023 లో ఆరుసార్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

అత్యధిక పరుగులు..

టీమిండియా కు చెందిన స్మృతి మందాన – షఫాలి వర్మ 2024 లో ఇప్పటివరకు (ఏదైనా వికెట్ కు) 825 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. థాయిలాండ్ జట్టుకు చెందిన నరు ఎమోల్ – నత్తకాన్ జోడి 2019లో 723 పరుగులు చేసింది.. 2023లో సౌత్ ఆఫ్రికాకు చెందిన తజ్మీన్, లారా జోడి 708 పరుగులు చేసింది.. 2018 లో న్యూజిలాండ్ జట్టుకు చెందిన సుజి – సోఫీ జోడి 680 రన్స్ చేసింది.

అత్యధిక వికెట్లు

టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా తరఫున మూడు వికెట్లను పలుమార్లు పడగొట్టి భారత బౌలర్లు సత్తా చాటారు.. 2012 -16 మధ్య ఏక్తా బిష్త్ రెండుసార్లు , 2016 -18 మధ్య అనూజ్ పాటిల్ రెండుసార్లు , 2020లో పూనం యాదవ్ రెండుసార్లు, 2024లో అరుంధతి రెడ్డి రెండుసార్లు మూడు వికెట్లను సాధించిన ఘనతను సొంతం చేసుకున్నారు.

అతిపెద్ద విజయం

శ్రీలంకతో దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత జట్టుకు దక్కిన అతిపెద్ద భారీ విజయం ఇది. 2014 సిల్క్ వేదికగా బంగ్లాదేశ్ పై 79, 2016లో బెంగళూరు వేదికగా బంగ్లాదేశ్ పై 72, 2010లో బాసె టెరే వేదికగా శ్రీలంకపై 71, 2018లో గయానా వేదికగా ఐర్లాండ్ పై 52 పరుగుల తేడాతో భారత్ విజయాలు సాధించింది. టి20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలలో ఇవి టాప్ -5 స్థానాలలో ఉంటాయి.