Homeఆంధ్రప్రదేశ్‌2024 Round Up:  ప్రభావవంతమైన మహిళగా నారా భువనేశ్వరి!

2024 Round Up:  ప్రభావవంతమైన మహిళగా నారా భువనేశ్వరి!

2024 Round Up: ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉందంటారు. అది అక్షర సత్యం. తన లక్ష్యసాధనలో ప్రతి పురుషుడి వెనుక మహిళ ఉండాలి. కుటుంబ బాధ్యతలతో పాటు భర్త లక్ష్యసాధన సాధ్యపడుతుంది.ఈ విషయంలో సక్సెస్ అయ్యారు నారా భువనేశ్వరి. ఆమె చేసిన వీరోచిత పోరాటానికి 2024 గుర్తింపు లభించింది. భర్త ఈ రాష్ట్రానికి నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు.కుమారుడు రెండోసారి మంత్రి పదవి చేపట్టాడు.భార్యగా, తల్లిగా అంతకంటే ఇంకా ఏం కావాలి.ఆమె ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నవరస నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుమార్తె. ఏపీతోపాటు జాతీయ రాజకీయాలను శాసించిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి. అంతటి గుర్తింపు సాధించిన ఆమె.. చాలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్లలో రాజకీయాలు పుణ్యమా అని.. ప్రత్యర్థులకు ఆమె టార్గెట్ అయ్యారు. కానీ వాటన్నింటిని అధిగమించగలిగారు.

* భర్త అరెస్టుతో..
గత ఏడాది సెప్టెంబర్ లో అరెస్ట్ అయ్యారు చంద్రబాబు. కనీసం ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేశారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలో భార్య భువనేశ్వరి అధైర్యం చెందలేదు. వెనక్కి తగ్గలేదు. బాధను దిగమింగుకొని పోరాట బాట పట్టారు. తన భర్త విషయంలో జరిగిన తప్పిదాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటివరకు రాజకీయ వేదికలు పంచుకొని ఆమె.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు.తన భర్తకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రజలతో మమేకమై పనిచేశారు. అలా పని చేస్తూనే 2024లో అడుగు పెట్టారు. అధినేత అరెస్టుతో డీలా పడిన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు భువనేశ్వరి.

* ఎనలేని విశ్వాసం..
2024లో కూటమి ఘనవిజయం సాధించింది. ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భువనేశ్వరి కళ్ళల్లో రెట్టింపు ఆనందం కనిపించింది. తెలుగు ప్రజలతో పెనవేసుకున్న నందమూరి తారక రామారావు కుమార్తెగా కంటే.. చంద్రబాబు భార్య గానే ఆమె హైలెట్ అయ్యారు. 2024 తెలుగు రాజకీయాల్లో తనకంటూ ముద్ర చూపగలిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా.. తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయ వేదికలు పంచుకుంటున్న ఆమె..తాను రాజకీయాల్లో అడుగు పెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణిగా మలి అర్ధ భాగంలోనూ.. ప్రభావవంతమైన మహిళగా నిలిచారు. అందుకు ఈ ఏడాది వేదికగా నిలవడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular