AP Elections 2024: సాధారణంగా ఎన్నికలన్నాక సర్వేలు వస్తుంటాయి. కానీ ఏపీ విషయంలో మాత్రం సర్వేలు కాస్త ముందుగానే కూశాయి. గత రెండేళ్లుగా సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇలా వచ్చిన సర్వేలన్నీ వైసీపీకి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. ఇటీవల వస్తున్న సర్వేలు మాత్రం కూటమి వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే తాజాగా నాగన్న పేరిట ఒక సర్వే బయటకు వచ్చింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ సర్వే నిర్వహించినట్లు సదరు సంస్థ చెబుతోంది. ఒక్కో నియోజకవర్గంలో 600 మంది చొప్పున 157 స్థానాల్లో 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించారు. వాటిని క్రోడీకరించి సర్వే ఫలితాలు వెల్లడించారు.
అయితే ఈ సర్వే సైతం వైసీపీ దే విజయం అని తేల్చడం విశేషం. 103 నియోజకవర్గాల్లో వైసిపి గెలవబోతుందని సర్వేలో తేలింది. కూటమి కేవలం 39 స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పింది. మిగిలిన 33 సీట్లలో వైసిపి, టిడిపి కూటమి మధ్య గట్టి ఫైట్ ఉంటుంది. ఇందులో కూడా 20 నుంచి 25 సీట్లు వైసిపి ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు సదరు సంస్థ చెబుతోంది.
లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. టిడిపి కూటమి నాలుగు నుంచి ఐదు స్థానాలకే పరిమితం కానున్నట్లు తేలింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళంలో వైసీపీకి ఏడు, టిడిపి రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఒకచోట మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుంది. విజయనగరంలో వైసీపీ ఏడు, టిడిపి 1, ఒకచోట హోరాహోరీ ఫైట్ ఉంటుంది. విశాఖపట్నంలో వైసీపీకి ఐదు, టిడిపికి ఆరు, నాలుగు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి ఆరు, టిడిపికి 8, ఐదు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది. పశ్చిమగోదావరిలో వైసీపీకి ఆరు, టిడిపికి ఐదు, నాలుగు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది. కృష్ణా జిల్లాలో వైసీపీకి ఆరు, టిడిపికి ఆరు, నాలుగు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది. గుంటూరులో వైసీపీకి ఎనిమిది, టిడిపికి నాలుగు, ఐదు చోట్ల గట్టి ఫైట్ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎనిమిది, టిడిపికి రెండు, రెండు చోట్ల ఫైట్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో 9 చోట్ల వైసిపి, ఒక్కచోట హారహోరి ఫైట్ ఉంటుంది. కడప జిల్లాలో వైసిపి పదికి పది స్థానాలను కైవసం చేసుకుంటుంది. కర్నూలులో వైసిపి 13 స్థానాలను గెలుచుకుంటుంది. అనంతపురంలో వైసీపీ 9, టిడిపి మూడు, రెండు చోట్ల ఫైట్ ఉంటుంది. చిత్తూరు జిల్లాలో వైసీపీకి పది, టిడిపికి రెండు స్థానాలు దక్కనున్నాయి. మరో రెండు చోట్ల గట్టి ఫైట్ ఉండనుంది.