Nagababu : పిఠాపురం వర్మ( Pithapuram Varma ) పరిస్థితి మరింత తీసుకట్టుగా మారుతోంది. ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు. పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు వర్మ. కానీ ఆ త్యాగానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. పవన్ గెలుపు కోసం పడిన శ్రమ గుర్తింపునకు నోచుకోలేదు. ఆపై అనుచిత కామెంట్స్ రూపంలో ఆయన చాలా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని హడావిడి నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పిఠాపురం బాధ్యతలను నాగబాబుకు పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : నాగబాబు కు షాక్ లాగా.. మంత్రి పదవి ఇప్పుడే కాదట
* వర్మపై అనుచిత కామెంట్స్
జనసేన ప్లీనరీలో నాగబాబు( Nagababu ) వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఆయన చరిష్మ కారణమని.. పిఠాపురం ప్రజలు మాత్రమే గెలిపించాలని.. ఇందులో మరొకరి శ్రమ అంటూ లేదని.. అలా అనుకుంటే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు నాగబాబు చేశారు. అయితే అది వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని తేలిపోయింది. ఒకవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు వర్మ. భవిష్యత్తులో ఆ నియోజకవర్గ తనకు దక్కుతుందన్న ఆశ కూడా లేదు. అయితే ఈ సమయంలో మరో పార్టీలో చేరితే తప్ప తనకు పిఠాపురం దక్కదని వర్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీని వదులుకునే స్థితిలో వర్మ లేరు. కానీ జనసేన రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులతో టిడిపిలో ఉండడం కష్టంగా మారుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
* నియోజకవర్గ బాధ్యతలు
ఎమ్మెల్సీగా( MLC) ఎన్నికయ్యారు నాగబాబు. ఏప్రిల్ ఒకటి నుంచి ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ కానున్నారు. అయితే ఆయనకు పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే వర్మకు మరిన్ని అవమానాలు ఖాయం. పిఠాపురం ఎమ్మెల్యే గా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు నాగబాబుకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే నియోజకవర్గం సమీక్షల నుంచి అన్ని రకాల కార్యక్రమాలు నాగబాబు కనుసన్న ల్లో జరుగుతాయి. అప్పుడు వర్మ కు మరిన్ని ఇబ్బందులు తప్పవు. పైగా నియోజకవర్గంలో మెగా బ్రదర్స్ మరింత పట్టు సాధిస్తారు. అందుకే వర్మ పునరాలోచనలో పడినట్లు సమాచారం.
* పదవి వచ్చినా..
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party ) కొనసాగితే.. ఎమ్మెల్సీ పదవి రావడం ఖాయం. అయితే పిఠాపురం నియోజకవర్గం పై వర్మ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు వర్మ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే వర్మ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. టిడిపిలో ఉంటే ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాలి. అలా ఉంటే నాగబాబు కింద పని చేయాల్సి ఉంటుంది. అలాగని పార్టీ నుంచి వెళ్లడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు.
Also Read : మీమర్స్ కి ట్రోల్ స్టఫ్ ఇచ్చిన నాగబాబు..పవన్ కళ్యాణ్ పుట్టుక గురించి షాకింగ్ కామెంట్స్!