Nara Lokesh
Nara Lokesh : ఏపీ ప్రభుత్వం ( AP government )మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ గవర్నెన్స్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటన చేశారు. ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సాప్ ద్వారా అందించగలుగుతున్నామని.. జూన్ నాటికి 400 సర్వీసులు అందిస్తామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఓ 200 సేవలతో మన మిత్ర యాప్ ద్వారా ఈ సేవలు కొనసాగుతూ వచ్చాయి. వాట్సాప్ ద్వారా క్షణాల్లో పౌర సేవలతో పాటు ప్రభుత్వ ధ్రువపత్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం.
Also Read : ఆ ఎమ్మెల్యే సోదరుడికి లోకేష్ క్లాస్.. నిజమేనా?
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యం..
కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు( artificial intelligence) అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో మనమిత్ర పథకం మొదటి విడత సక్సెస్ కావడంతో రెండో విడత ప్రారంభానికి చర్యలు తీసుకుంటుంది. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ 2.0 ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా కొన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు నారా లోకేష్. ఏఐ ఆధారిత వాయిస్ సేవలు అందుబాటులోకి వస్తాయని.. ఒకచోట నుంచి మరోచోటకు టికెట్ కావాలని జస్ట్ నోటితో చెబితే.. టికెట్ బుక్ చేసేలా సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు లోకేష్. అలాగే నంబర్ చెబితే కరెంట్ బిల్లు చెల్లించేలా కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.
* విద్యార్థులకు గుడ్ న్యూస్
విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల సేవలు ఈసారి వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance) ద్వారా అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల కాగానే.. వాటిని నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నెంబర్లకు పంపిస్తామన్నారు. ఇప్పటికే విద్యాశాఖ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాల్ టికెట్లు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ప్రజలు తమ ఇబ్బందులకు సంబంధించి ఫిర్యాదులు కూడా ఈ విధానం ద్వారా చేయవచ్చు అన్నారు. జనవరి 30 నుంచి 155 సేవల తో అందుబాటులోకి వచ్చాయని.. ప్రస్తుతం 200 సేవలను అందిస్తున్నట్లు తెలిపారు లోకేష్. ఈ మార్చి చివరి నాటికి 300, జూన్ 30 నాటికి 500 సేవలు అందిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు అడిగిన సేవను 10 సెకండ్లలో అందించిన ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
* లోకేష్ సవాల్
అయితే వాట్సాప్ గవర్నెన్స్ విధానంపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు సంబంధించి సమాచారం బయటకు వెళ్ళిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోకేష్ సవాల్ చేశారు. అది జరిగినట్టు నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. తాజాగా శాసనసభలో సైతం లోకేష్ ఈ విషయంపై మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందని.. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీలేదన్నారు. అవన్నీ రాజకీయ విమర్శలుగా కొట్టిపారేశారు.
Also Read : లోకేష్ కు ప్రమోషన్.. చంద్రబాబు ప్లాన్ అదే!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Exam results for students phones nara lokeshs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com