Nagababu: జనసైనికులకు నాగబాబు గట్టి హెచ్చరిక

కౌంటింగ్ నాడు గోదావరి జిల్లాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో విధ్వంసాలు జరుగుతాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అటువంటి ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Written By: Dharma, Updated On : May 30, 2024 1:59 pm

Nagababu

Follow us on

Nagababu: ఏపీలో కౌంటింగ్ నాడు విధ్వంసాలు జరగనున్నాయా? అధికార వైసిపి అలా ప్లాన్ చేసిందా? ఇప్పటికే ఆ పార్టీకి ఓటమి అని సంకేతాలు వచ్చాయా? అందుకే గొడవలకు అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. పోలింగ్ నాడు, పోలింగ్ తరువాత విధ్వంసాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విధ్వంసకాండ తర్వాత వైసీపీపైఒక రకమైన అనుమానాలు నెలకొన్నాయి.అటు వైసీపీ నేతల మాటలు కూడా వివాదాలకు దగ్గరగా ఉన్నాయి. ముఖ్యంగా జనసేన ను టార్గెట్ చేసుకుని విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని అనుమానాలు ఉన్నాయి. నిఘవర్గాల హెచ్చరికలతో నాగబాబు ప్రత్యేకంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా జనసైనికులకు కీలక సూచనలు చేశారు.

కౌంటింగ్ నాడు గోదావరి జిల్లాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో విధ్వంసాలు జరుగుతాయని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అటువంటి ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 300 స్పాట్లను గుర్తించి.. వివిధ షీట్లు ఉన్న వారిని ప్రత్యేకంగా హెచ్చరించారు. మారణాయుధాలు, బాంబుల కోసం అన్వేషించారు. విస్తృత తనిఖీలు చేపట్టారు.మరోవైపు వచ్చే నెల 19 వరకు కేంద్ర బలగాలు ఏపీలో ఉండేలా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఫలితాల ప్రకటన తరువాత రెండు వారాలపాటు కేంద్ర బలగాలు ఏపీలో ఉండేలా చర్యలు చేపట్టారు.

ఇటువంటి పరిస్థితుల్లో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చేసినవిన్నపం సంచలనం రేకెత్తిస్తోంది.వైసిపి కవ్వింపు చర్యలకు ఎవరు స్పందించవద్దని.. విధ్వంసాలకు ప్లాన్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. కచ్చితంగా కూటమి గెలుస్తుందని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అందుకే ప్రతి జన సైనికుడుకౌంటింగ్ కు సహకరించాలని కోరారు. సంయమనం పాటించి ఎలక్షన్ కమిషన్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నాగబాబు విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులు ట్రోల్ చేస్తున్నారు.