Chandrababu: టిడిపి కూటమి గెలుపు పై చంద్రబాబుకు పక్కా లెక్క

ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి 35 స్థానాలకు మించి వచ్చే ఛాన్స్ లేదని చంద్రబాబు తేల్చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమైందని చెప్పుకొచ్చారు. ప్రజలు కసితో ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు.

Written By: Dharma, Updated On : May 30, 2024 1:56 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో కీలక ఘట్టం పూర్తయింది. మరో నాలుగు రోజుల వ్యవధిలో ఫలితం తేల నుంది. 48 గంటల వ్యవధిలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం రానున్నాయి. పలు జాతీయ సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడించనున్నాయి. మరోవైపు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు నిన్న తిరిగి వచ్చారు. కౌంటింగ్ సరళి పై పార్టీ శ్రేణులతో సమీక్షిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన అధినేతను చాలామంది కీలక నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.వారితో చంద్రబాబు హుషారుగా గడిపారు.ఎన్నికల ఓటింగ్,కౌంటింగ్ ప్రక్రియపై చంద్రబాబు చర్చించారు.వారి నుంచి కొంత ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ నేతల్లో ఆనందం నింపాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి 35 స్థానాలకు మించి వచ్చే ఛాన్స్ లేదని చంద్రబాబు తేల్చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమైందని చెప్పుకొచ్చారు. ప్రజలు కసితో ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. సైలెంట్ ఓట్లు వైసిపి కొంప ముంచనున్నాయని కూడా తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని.. ప్రజలు సైలెంట్ గా ఓటు వేశారని.. బహిరంగపరిస్తే పథకాలు నిలిపివేస్తామని, కేసులు పెడతామని భయపెట్టడం వల్లే బయటపడలేదని చెప్పుకొచ్చారు. నివేదికలు, సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయని.. వైసీపీ నేతలది మేకపోతు గాంభీర్యం అంటూ చంద్రబాబు టిడిపి నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

అయితే చంద్రబాబుకు ఇప్పటికే నివేదికలు అందాయని.. సర్వేలు చేపట్టిన సంస్థలు సమగ్ర వివరాలు చంద్రబాబుకు అందించినట్లు తెలుస్తోంది. జనసేన విషయంలో సైతం చంద్రబాబు ఫుల్ ఖుషి గా ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూటమికి సంపూర్ణ సహకారం అందించారని టిడిపి నేతలు వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. జనసేన మెజారిటీ స్థానాల్లో గెలుపు పొందుతుందని కూడా సమాచారం ఉన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు. కూటమికి 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. ప్రభంజనం వీచితే ఏకపక్షంగా విజయాలు నమోదయ్యే అవకాశం ఉందని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే చంద్రబాబు తన మనసులో ఉన్న మాటను కేవలం టిడిపి నేతలు వద్ద బయటపెట్టారు. దీంతో ఇది పార్టీ శ్రేణులకు విస్తరిస్తోంది. క్యాడర్లో నమ్మకం పెరుగుతోంది.