https://oktelugu.com/

Nagababu: మీడియా రంగంలోకి నాగబాబు.. ఎల్లో మీడియా హ్యాండ్ ఇస్తుందని అనుమానం!

ఏపీలో జనసేన సంపూర్ణ విజయం సాధించింది. పవన్ వ్యూహం మేరకు శత శాతం విజయం సాధ్యమైంది. అందుకే రాజకీయ వ్యూహం మార్చింది ఆ పార్టీ.మీడియా మద్దతు కోసం సరికొత్తగా ప్రయత్నిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : August 10, 2024 / 12:24 PM IST

    Nagababu

    Follow us on

    Nagababu : మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రంగంలోనైనా, రాజకీయరంగంలోనైనా సోదరులు ఇద్దరికీ వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు నాగబాబు.ఇటీవల జనసేన గెలుపులో సైతం నాగబాబు కీలక భాగస్వామ్యం అయ్యారు.జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు.2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. రఘురామకృష్ణం రాజు చేతిలో ఓడిపోయారు. అటు తరువాత కొద్ది రోజులు పాటు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. కానీ ఎన్నికలకు ముందు మూడు సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. పవన్ సినిమాలతో బిజీగా ఉండగా పార్టీ సమన్వయ బాధ్యతలు చూసుకున్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.కానీ పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించారు. అయితే ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయలేదు. జనసేనతో పాటు కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. జనసేన ప్రచారాన్ని సమన్వయం చేసుకున్నారు. పోటీ చేసిన నియోజకవర్గాల్లో జనసేన శత శాతం విజయం సాధించగా… కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో నాగబాబుకు కీలక పదవి దక్కుతుందని అంత అంచనా వేశారు. అయితే ఇంతలో నాగబాబు మీడియా రంగంలో అడుగుపెట్టడం విశేషం. ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ వైపు అడుగులు వేసినా.. త్వరలో న్యూస్ ఛానల్ వైపు సైతం విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ పేరుతో లోగోను ఆవిష్కరించారు. పక్కా ప్రణాళికతోనే నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

    * సోషల్ మీడియాలో యాక్టివ్
    వాస్తవానికి సోషల్ మీడియాలో నాగబాబు చాలా యాక్టివ్ గా ఉంటారు.తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలను షేర్ చేసుకునేవారు. ఏపీలో అన్ని పార్టీలకు మీడియా మద్దతు ఉంది. జనసేనకు మాత్రం సొంత మీడియా వ్యవస్థ లేదు. ప్రస్తుతం వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ నాగబాబు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ కు పరిమితం అయ్యారు. త్వరలో పొలిటికల్ న్యూస్ కూడా ఉండవచ్చని చర్చ జరుగుతోంది.

    * ఆ మీడియా ఎదురుతిరిగితే
    టిడిపి మీడియా మద్దతు ప్రస్తుతం జనసేనకు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో రాజకీయాలు మారితే మాత్రం తప్పకుండా సొంత మీడియా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకే రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలన్న వ్యూహంలో భాగంగానే మీడియా రంగంలోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ముందుగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభించి.. తరువాత పొలిటికల్ న్యూస్ కు ప్రాధాన్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

    * ఆ కారణంతోనే
    మిగతా రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే జనసేనకు మీడియా ప్రాధాన్యం అంతంత మాత్రమే. కొంతమంది మీడియా ఔత్సాహికులు జనసేనలో ఉండేటప్పుడు హడావిడి చేసేవారు. పార్టీ మారిన తర్వాత జనసేనకు వ్యతిరేకంగా మారారు.అందుకే అటువంటి పరిస్థితికి రాకుండా.. పార్టీకి ఫిక్స్డ్ మీడియా గా ఉండడానికి నాగబాబు కొత్త ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ మీడియాతో ఎంటర్టైన్మెంట్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అది సక్సెస్ అయిన తర్వాత క్రమేపి పొలిటికల్ వార్తల వైపు మల్లిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.