Mohan Babu: మంచు మోహన్ బాబు( manchu Mohan Babu) రాజకీయాల్లో లేరు. ప్రస్తుతం రిజర్వుడ్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అంతకు ముందు నుంచే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఆ పార్టీలో అధికారికంగా చేరారు కూడా. అయితే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. పోసాని కృష్ణ మురళి, అలీతో పాటు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి లాంటి వారికి పదవులు ఇచ్చారు జగన్. కానీ మోహన్ బాబు విషయంలో మొండి చేయి చూపారు. దీంతో క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు మోహన్ బాబు. అలాగని ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. ఎన్నికలకు ముందు మాత్రం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. టిడిపికి అనుకూలంగా మాట్లాడారు. అంతకుమించి అన్నట్టు ఏమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కుటుంబ వివాదాలతో పాటు పాత కేసులు వెంటాడుతున్నాయి మోహన్ బాబుకు.
Also Read: రక్తం ఉడికి పోతోంది.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నా: శిఖర్ ధావన్
* ఎన్నికల కోడ్ సమయంలో ఆందోళన..
2019 ఎన్నికల కోడ్( election code) అమల్లోకి వచ్చిన తరువాత మోహన్ బాబు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు కుమారులతో కలిసి రోడ్డు ఎక్కారు. తిరుపతిలో ఆందోళనలు జరిపారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంగించారనే ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటినుంచి కేసు విచారణ కొనసాగుతోంది. మోహన్ బాబు మాత్రం పెద్దగా హాజరు కావడం లేదు. అయితే విచారణ హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని కోరుతూ మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
* కుటుంబ పరంగా వివాదాలు..
ప్రస్తుతం మోహన్ బాబు వయసు 75 సంవత్సరాలు. కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సినీ రంగంలో( cine field) సైతం ఇద్దరు పిల్లలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నారు విష్ణు. సక్సెస్ అయితే మాత్రమే నిలదొక్కుకోగలరు. చిన్న కుమారుడు మనోజ్ పరిస్థితి కూడా అలానే ఉంది. అటు మోహన్ బాబు సైతం ఏ పార్టీలో చేరలేదు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పలేదు. ఇటు ఎప్పుడో పాత కేసు మళ్లీ వెంటాడుతోంది. ఇప్పట్లో అది కూడా కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
* ఎన్టీఆర్ కు సన్నిహిత నేతగా..
సినీ రంగం తో పాటు రాజకీయ రంగంలో కూడా తనదైన పాత్ర పోషిస్తూ వచ్చారు మోహన్ బాబు. ఎన్టీఆర్ కు ( Nandamuri Taraka Rama Rao ) అత్యంత సన్నిహితుడుగా కూడా గుర్తింపు పొందారు. చంద్రబాబుకు సమకాలీకుడు కూడా. అయితే చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి బయటకు వచ్చారు. చాలా ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం కూడా చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా మోహన్ బాబుకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబుతో మంచి సంబంధాలు నెలకొన్నాయి కానీ.. గట్టెక్క లేకపోతున్నారు. మోహన్ బాబు పరిస్థితిని చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: యజువేంద్ర చాహల్ “తీన్ మార్”.. ధనశ్రీ ఎఫెక్ట్ నుంచి బయటపడ్డట్టేనా..