Modi Praises Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి పూర్తిగా మారింది. గతంలో వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్ మొన్నటి ఎన్నికలతో తగ్గింది. ఆపై ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం మాత్రమే ప్రధానితో చర్చిస్తున్నారు. నమ్మదగిన మిత్రుడిగా మారిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పట్ల కూడా మోడీ ఎంతో గౌరవభావంతో ఉన్నారు. అయితే నిన్ననే కర్నూలు పర్యటనకు వచ్చారు ప్రధాని మోదీ. చంద్రబాబుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ కనిపించారు. అయితే చంద్రబాబు బహిరంగ సభల్లో ఇంగ్లీష్, హిందీలో మాట్లాడడం అరుదు. అటువంటిది జిఎస్టి తగ్గింపు గురించి, దాని సక్సెస్ గురించి హిందీలో మాట్లాడారు చంద్రబాబు. అయితే ఆయన హిందీ మాట్లాడే తీరు ప్రధాని నరేంద్ర మోడీని ఆకట్టుకుందట.
* జీఎస్టీ సంస్కరణలపై ప్రసంగం..
సహజంగానే చంద్రబాబు ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతారు. అవసరం అనుకుంటే ఇంగ్లీషులో ప్రసంగిస్తారు. కానీ నిన్నటి సభలో బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న మేలును వివరించారు. వచ్చే నెలలో జరిగే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ జైత్ర యాత్ర కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఆ వీడియోను ఢిల్లీ వెళ్లిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు హిందీలో బాగా మాట్లాడుతున్నారంటూ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. బీహార్ లో ఎన్డీఏ కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారని.. ఏక్ భారత్.. శ్రేష్టభారత్ పట్ల తన ప్రగాఢ నిబద్ధత ప్రదర్శించారని కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ.
* మారిన అభిప్రాయం..
ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు మాత్రం చంద్రబాబు సహకారం అవసరం అయింది నరేంద్ర మోడీకి( pm Narendra Modi). అయితే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏను విభేదించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు. అది మొదలు ప్రధాని మోదీ తో చంద్రబాబుకు గ్యాప్ ఏర్పడింది. మొన్నటి ఎన్నికలతో అది పూర్తిగా రూపు మారింది. గత 16 నెలల కాలంలో చంద్రబాబు అడుగులు, ఆయన ఆలోచన సరళి మోదిని ఆకట్టుకుంది. అందుకే రాష్ట్రం విషయంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారు మోడీ. రాష్ట్ర అభివృద్ధితో పాటు రాజకీయపరంగా టిడిపి కూటమి ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రత్యర్ధులు సవాళ్లు విసురుతున్న తరుణంలో.. తన మిత్రుడు చంద్రబాబు జిఎస్టి సంస్కరణల గురించి గొప్పగా చెప్పడాన్ని అభినందిస్తున్నారు మోడీ. అందుకే ఈ ట్వీట్ చేశారు.
బీహార్లో ఎన్డీఎ విజయావకాశాల గురించి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛమైన హిందీలో మాట్లాడం ద్వారా అనేక మంది ఎన్డీఎ కార్యకర్తల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పట్ల లోతైన నిబద్ధతను కూడా చూపించారు.@ncbn pic.twitter.com/DeBDQ3jrzo
— Narendra Modi (@narendramodi) October 16, 2025