Homeఆంధ్రప్రదేశ్‌Modi Amravati Visit: అమరావతిలో ఏర్పాట్లు షురూ.. ప్రధాని మోడీ ఫుల్ షెడ్యూల్ విడుదల!

Modi Amravati Visit: అమరావతిలో ఏర్పాట్లు షురూ.. ప్రధాని మోడీ ఫుల్ షెడ్యూల్ విడుదల!

Modi Amravati Visit: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మే 2న అమరావతిలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. అశేష జనవాహిని నడుమ అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గ ఉప సంఘం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు కేంద్ర బలగాలు సైతం అమరావతిని సందర్శించాయి. నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తిగా మారింది.

Also Read: బెంగళూరులో వ్యూహకర్తలతో జగన్!

* ప్రధాని పర్యటన ఇలా
మే 2న ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం చేరుకోనున్న ప్రధాని మోదీ.. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో మూడున్నర గంటలకు అమరావతి లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలోమీటర్ల మేరా రోడ్డు షోలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఈ రోడ్ షో ఉంటుంది. 3:45 గంటల నుంచి నాలుగు గంటల వరకు అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు సభ నిర్వహిస్తారు. అనంతరం అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రధాని ప్రసంగం ఉంటుంది. సభను ముగించుకుని సాయంత్రం 5:10 గంటలకు హెలిక్యాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. 5:20 కి గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు ప్రధాని మోదీ.

* మూడు వేదికలు సిద్ధం..
ప్రధాని నరేంద్ర మోడీ సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మిగతా వివిఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై 100 మంది ఉంటారు. ప్రధాని సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజల రాకపోకల కోసం 8 రోడ్లను, 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సభకు రావడానికి వీలుగా ఈ-11, ఈ- 13, ఈ -15 రోడ్లతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తారు. ఈ రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని సిఆర్డిఏ అధికారులను ఆదేశించారు.

* రెండోసారి శంకుస్థాపన..
ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడం ఇది రెండోసారి. 2017లో తొలిసారిగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అయితే మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్వీర్యంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త రూపు వచ్చింది. జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. గత పది నెలలుగా నిధుల సమీకరణ జరిగింది. అది ఒక కొలిక్కి రావడంతోనే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

 

Also Read: వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version