MLCs Resignation Approved : ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయ పరిణామాలు నడుస్తున్నాయి. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోనుంది. ఈ ఏడాది కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దాదాపు నిర్వీర్యం చేసినంత పని చేసింది. ఒకవైపు వైసీపీ నేతలపై కేసులు కొనసాగుతుండగా మరోవైపు నేతలు ఆ పార్టీకి పెద్ద ఎత్తున గుడ్ బై చెప్పారు. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం.. తన బాట తాను చూసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఇటువంటి క్రమంలో రాజకీయంగా పూర్తిగా కూటమి పై చేయి అన్నట్టు కనిపిస్తోంది. అయితే ఒకే ఒక విషయంలో మాత్రం కూటమి అనుకున్నది సాధించలేకపోయింది. ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి శాసనమండలిలో ఆధిక్యత కనబరచాలని భావించింది. కానీ శాసనమండలి చైర్మన్ రూపంలో టిడిపి కూటమికి షాక్ తప్పలేదు.
Also Read : జగన్ తర్వాత ఆయనే.. ఫుల్ క్లారిటీ!
* పదవులు వదులుకొని రాజీనామాలు..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కూటమి పార్టీల్లో చేరారు. కొందరైతే వైసిపి ద్వారా సంక్రమించిన పదవులను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆరుగురు ఎమ్మెల్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇది జరిగి ఆరు నెలలు పైగా గడుస్తోంది. కానీ ఇంతవరకు ఆ రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. అయితే వారి తరువాత రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యుల రాజీనామాలు ఆమోదానికి నోచుకున్నాయి. వారి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కొత్తవారు సైతం రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఏకంగా రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేశారు కూడా. కానీ ఎమ్మెల్సీలు మాత్రం త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లలేక.. కూటమి పార్టీల్లో చేరలేక సతమతమవుతున్నారు. అయితే వారి రాజీనామాల ఆమోదం విషయంలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టే.
* 8 నెలల కిందట రాజీనామాలు..
కూటమి అధికారం చేపట్టాక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ( YSR Congress party ) చెందిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, జయ మంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్ వంటి ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్ ఫార్మేట్లో తమ రాజీనామా లేఖలను పంపించారు. వ్యక్తిగతంగా కూడా లేఖలు రాశారు. కానీ శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు కానీ.. శాసనమండలి చీఫ్ అధికారి కానీ ఆ రాజీనామాలను ఆమోదించడం లేదు. వీరి తరువాత రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్రావు ల రాజీనామాలు ఆమోదానికి నోచుకున్నాయి. వారు ఖాళీ చేసిన స్థానాలకు ఉప ఎన్నిక కూడా పూర్తయింది. అయితే ఈ విషయంలో కూటమి అనుకున్నది సాధించలేకపోయింది.
* శాసనమండలిలో వైసిపికి బలం..
అయితే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా బలం ఉంది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత శాసనమండలిలో ఆ పార్టీ బలం అక్షరాల 38 మంది. అయితే శాసనమండలి ద్వారా కూటమి ప్రభుత్వ దూకుడును అడ్డుకుందామని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే శాసనమండలిలో విపక్ష నేతగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణను నియమించారు. అదే సమయంలో పూర్తి విధేయతతో ఉన్నారు శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆయన ఆమోదించలేదు. ఈ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదించిన మరుక్షణం చాలామంది వైసిపి ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశం ఉంది. అదే జరిగితే శాసనమండలిలో టిడిపి ఓటమి పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఏడాది పాటు రాజీనామాలను ఆమోదించకుండా తొక్కి పెట్టడం సంచలనమే.