Varudu Kalyani: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. శాసనసభకు తొలి రోజు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొద్దిసేపు ఉండి బయటకు వెళ్లిపోయారు. కానీ మండలిలో మాత్రం వైయస్సార్సీపి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. తమ బలమైన వాయిస్ చూపే ప్రయత్నం చేస్తున్నారు. మండలిలో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆపై ప్రతిపక్ష హోదా కూడా ఉంది. ఆ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉన్నారు. మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేతగా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వైయస్సార్సీపి ఎమ్మెల్సీలు గట్టిగానే మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మంత్రులు సమాధానం చెప్పేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
* ఇదేనా సుపరిపాలన?
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కాస్త గట్టిగానే మాట్లాడారు. రాష్ట్రంలో సుపరిపాలన అంటూ చెబుతున్నారని.. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భారీగా అప్పులు తెస్తున్నారని.. మరి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సుపరిపాలన అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన అంటూ ఏమీ లేదని.. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి… 9 నెలల పాటు కాలం గడిపేసారని ఎద్దేవా చేశారు వరుదు కళ్యాణి.
* మంత్రి సమక్షంలోనే
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) ఎమ్మెల్సీలు మాట్లాడిన సమయంలో సభలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ముఖ్యంగా కూటమి 1.25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని.. ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు కళ్యాణి. కనీసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 2 ఉద్యోగాలను సైతం ఎటువంటి సమస్యలు లేకుండా భర్తీ చేయలేకపోయారని.. ఇదేనా సుపరిపాలన అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు. అయితే మండలి చైర్మన్ వైసీపీ నేత కావడంతో వరుదు కళ్యాణి మాట్లాడేందుకు పూర్తిగా అవకాశం కల్పించారు. దీంతో ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. దీనిపై తీవ్ర అసహనానికి గురయ్యారు మంత్రి నారా లోకేష్.
* గట్టిగానే స్పందించిన లోకేష్
వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాటలకు ధీటుగా స్పందించారు నారా లోకేష్( Nara Lokesh). కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తాము 1.25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని… ఉద్యోగ ఉపాధి మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చామని.. దానికి కొంత సమయం పడుతుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. మొత్తానికైతే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దెబ్బకు మొహం మాడిపోయింది లోకేష్ ది
-వరుదు కల్యాణి మాస్ ర్యాగింగ్ pic.twitter.com/17hEkcxtCI
— Rahul (@2024YCP) February 25, 2025