MLC Elections 2025: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? కూటమికి ఏకపక్ష విజయం దక్కనుందా? లేకుంటే పిడిఎఫ్ అభ్యర్థులు కైవసం చేసుకుంటారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఉభయగోదావరి, కృష్ణా- గుంటూరు నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. హోరా హోరీగా సాగిన ఈ పోరులో గెలుపు ఎవరినేది ఆసక్తికరంగా మారింది. అయితే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు టిడిపి కూటమి మద్దతు తెలిపింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిడిఎఫ్ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు టిడిపి అభ్యర్థులతో పోటీ పడ్డారు. అయితే పోలింగ్ సరళిని బట్టి టిడిపి అభ్యర్థులకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో
రెండు పట్టబద్రుల ఎన్నికలకు సంబంధించి టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా- గుంటూరు పట్టభద్రుల స్థానానికి సంబంధించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర పోటీ చేశారు. ఈయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా ఆయన సామాజిక వర్గానికి రెండు జిల్లాలు మంచి పట్టు ఉంది. ప్రారంభంలో అభ్యర్థిత్వానికి వ్యతిరేకత వ్యక్తం అయినా.. క్రమేపి అది సర్దుబాటు అయ్యింది. ఆలపాటి రాజా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో పిడిఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణరావు గట్టి పోటీ ఇచ్చినా.. అధికార పార్టీ ఎదుట నిలువ లేకపోయారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా గురువారం పోలింగ్ నాడు తనతో పాటు తన కుమారుడిపై దాడి జరిగిందన్న లక్ష్మణ్ రావు కామెంట్స్ తో ప్రత్యర్థి పై చేయి సాధించారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినా.. అధికార కూటమి అభ్యర్థి ఎదుట నిలువ లేక పోయారన్న టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూ టమి అభ్యర్థి స్పష్టమైన గెలుపు దిశగా పయనిస్తున్నారని ఆ మూడు పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. అక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో దిగలేదు. టిడిపి నుంచి పేరాభత్తుల రాజశేఖర్ బరిలో ఉన్నారు. ఆది నుంచి ప్రచారంతో పాటు తనకంటూ ఒక ఉనికి చాటుకుంటూ వచ్చారు. ఉభయగోదావరి జిల్లాలో టిడిపి తో పాటు జనసేన బలమైన శక్తిగా ఉంది. దీంతో మూడు పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అందుకే అక్కడ టిడిపి అభ్యర్థి విజయానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిడిఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలిపినా ఫలితం లేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఆస్థానం సైతం కూటమి కైవసం చేసుకుంటుందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గట్టిగానే పోటీ జరిగింది. ఇక్కడ ఏపీటీఎఫ్ వర్సెస్ పిఆర్టియు వర్సెస్ యుటిఎఫ్ అన్నట్టు పరిస్థితి మారింది . అయితే టిడిపి కూ టమి అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మద్దతు తెలిపింది. దీంతో ఆయన గెలుపు అనివార్యంగా మారింది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో టిడిపి కూటమి బలమైన శక్తిగా ఉంది. ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు తెలపడంతో టిడిపి ఏకతాటి పైకి వచ్చింది. జనసేన తో పాటు బిజెపి మద్దతు తీసుకుంది. అందుకే ఆ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటును టిడిపి కూటమి కైవసం చేసుకుంటుందని విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: పిఠాపురం ఇలాకాలో ఓటుకు రూ.3000.. పట్టభద్రులు పండుగ చేసుకున్నారు.. వైరల్ వీడియో