AP MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈరోజు పోలింగ్ జరిగింది. యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయడంతో.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దీంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు ఉభయగోదావరి పట్టభద్రుల స్థానంతో పాటు కృష్ణా- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో భారీగా ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అధికార కూటమి తరపున టిడిపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు పిడిఎఫ్ అభ్యర్థులు సైతం గట్టి పోటీ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో.. ఆ పార్టీ టిడిపి అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది.
Also Read: బాలయ్యతోనే పెట్టుకుంటారా.. దబిడ దిబిడే.. సీరియస్.. వైరల్ వీడియో
* పిఠాపురంలో పంచుడు
మరోవైపు ఉభయగోదావరి జిల్లా పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానంలో భారీగా ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పట్టభద్రుల ఓట్లు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టిడిపి కూటమి అభ్యర్థి అనుచరులపైనే ఆరోపణలు వచ్చాయి. పిఠాపురంలో ఓ కళ్యాణ మండపంలో పట్టభద్రులకు స్లిప్పులు పంచుతూ రూ.3000 చొప్పున నగదు పంచారన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.
* సోషల్ మీడియాలో ప్రచారం
గుంటూరు- కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. ఇక్కడ సైతం ప్రలోభాలకు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే అటువంటిదేమీ లేదని.. పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ జరిగిందని.. కూటమి అభ్యర్థుల విజయాన్ని తట్టుకోలేక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని.. టిడిపి కూటమి ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏపీటీఎఫ్ తరఫున పాకలపాటి రఘువర్మ తప్పకుండా గెలుస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. ఈనెల మూడున ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఆరోజు విజేతలు ఎవరు అనేది స్పష్టం కానుంది.
పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం
మున్సిపల్ కళ్యాణ మండపం దగ్గర ఓటుకు రూ. 3 వేలు పంచుతున్న కూటమి అభ్యర్థి అనుచరులు
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అనుచరుడు గంగాధర్ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు
కళ్యాణ మండపం దగ్గరికి చేరుకున్న పోలీసులు,… pic.twitter.com/LnKUxmluf7
— Anitha Reddy (@Anithareddyatp) February 27, 2025