MLC Duvvada Srinivas: త్వరలో దువ్వాడ బయోపిక్ తెరపైకి రానుందా? ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు ఆ ప్రయత్నాల్లో ఉన్నారా? ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.గత మూడు నెలలుగా దువ్వాడ ఫ్యామిలీ వివాదం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినోదాన్ని పంచింది. ప్రతిరోజు ఇదో రచ్చగా మారింది. విజయవాడ వరదల సమయంలో కాస్త తగ్గుముఖం పట్టింది. లేకుంటే మీడియాకు సైతం ఇదే ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఆయనపై భార్య, కుమార్తెలు చేసిన ఆరోపణలు,చేసిన నిరసనలు, చూపించిన వాట్సాప్ మెసేజ్ లు, ఆస్తుల వ్యవహారాలు, పార్టీ ఆఫీస్ పంచాయితీలు ఇలా ఒకటేమిటి.. ప్రతిరోజు ఏదో ఒక అంశం బయటపడుతూనే ఉంది. అన్నింటికీ మించి దివ్వెల మాధురితో ఆయన లవ్ ట్రాక్ మరింత ఆకట్టుకుంది. ఎవరేమనుకున్నా తాను దువ్వాడ తోనే ఉంటానని.. దీనిని లివ్ ఇన్ టుగెదర్ అన్నారని.. అడల్ట్రీ అంటారని.. దాని అర్థం డిక్షనరీలో కనిపించేది కాదని.. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని పేర్కొందని గుర్తు చేస్తూ మాధురి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
* అనేక మలుపులు తిరుగుతూ..
తొలుత దువ్వాడపై దూకుడుగా వ్యవహరించిన ఆయన భార్య వాణి స్వరంలో మార్పు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఎలా ఉన్నా పర్వాలేదు.. ఎవరితో ఉన్నా పర్లేదు.పిల్లల కోసం అయినా తమతో కలిసి ఉంటే చాలు. మాతో పాటు ఒకే ఇంట్లో ఉంటే చాలు అనే స్థాయిలో భార్య వాణి కోరుకుంది. అయితే ఈ వివాదం కోర్టులో ఉంది కనుక.. విడాకులే శరణ్యం అన్నట్టు తేల్చి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. తన భార్య దువ్వాడ వాణి తో కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పిల్లల బాధ్యత మాత్రం తాను చూసుకుంటానని చెప్పుకొచ్చారు.
* ప్రముఖ నిర్మాత సిద్ధం
ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట టీవీ ఛానల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ప్రముఖ మీడియా ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. తిరుపతిలో ప్రత్యక్షమైన ఈ జంట భక్తులకు కనువిందు చేసింది. ఇందులో మాధురి పై కేసు కూడా నమోదు అయ్యింది. మరోవైపు దువ్వాడ ఎపిసోడ్ కు సంబంధించి కీలక విషయం ఒకటి బయటపడింది. త్వరలో దువ్వాడ శ్రీనివాస్ బయోపిక్ తెరకు ఎక్కనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రధమార్ధం దువ్వాడ బాల్యం, వ్యాపారం, వివాహం, రాజకీయం తదితర అంశాలను చూపిస్తారు. ద్వితీయార్థం మాత్రం మాధురితో లవ్ ట్రాక్ చూపిస్తారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా పట్టాలెక్కించేందుకు నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.