Rohit Sharma : ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ టీమ్ గా చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగుతూ వచ్చిన ముంబై ఇండియన్స్ టీమ్ గత సంవత్సరం ఢీలా పడిపోయింది. ఇక 2024 లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆ టీం ఏమాత్రం ప్రభావం చూపించకపోగా, హార్దిక్ పాండ్య భారీ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక రోహిత్ శర్మ ని కెప్టెన్సీ పదవి నుంచి తొలగించి హార్దిక్ పాండ్యా కి కట్టబెట్టడంతో ముంబై యాజమాన్యం పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం మెగా ఆక్షన్ జరగనున్న నేపధ్యం లో ఇప్పుడు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉంటాడా లేదా టీమ్ నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈనెల 31వ తేదీ లోపు ముంబై ఇండియన్స్ టీం ఏ ప్లేయర్స్ ను రిటైన్ చేసుకుంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, జాస్ప్రిత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లను ముంబై ఇండియన్స్ టీమ్ రిటైన్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక మిగిలిన ప్లేయర్లని టీం నుంచి వదిలేసి మళ్లీ మంచి ప్లేయర్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ మెగా ఆక్షన్ లో అన్ని టీమ్ ల ప్రాంచైజీల భారీ రేంజ్ లో పోటీ అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి…
ఇక ఇదిలా ఉంటే ముంబై యాజమాన్యం టీంలో రోహిత్ శర్మ ను టీమ్ లో కంటిన్యూ చేస్తే ఆయనకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందా లేదంటే మళ్లీ హార్దిక్ పాండ్యా నే కెప్టెన్ గా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ లో కొనసాగుతాడా లేదంటే బయటకు వచ్చి వేరే టీంలో ఆడతాడా అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ టీమ్ ని 5 సార్లు ఛాంపియన్స్ గా నిలిపిన రోహిత్ శర్మ మీద ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఎలాంటి వైఖరిని పాటిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు వేచి చూడాల్సిందే…