Viral Video : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. కూటమి వెర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పేలా లేవు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతల పై కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను కూటమి బయటపెడుతోంది. అందుకు బాధ్యులను చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు మోపుతోంది. ఈ తరుణంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తోందని.. నారా లోకేష్ ఆదేశాలతోనే ఈ అరెస్టులు కొనసాగుతున్నాయని వైసీపీ చెబుతోంది. ఇటువంటి తరుణంలో నారా లోకేష్ మీడియా సమావేశంలో ఏకంగా సాక్షిపై సెటైర్లు వేశారు.
* అప్పట్లో నారా లోకేష్ పై ట్రోల్స్
గతంలో వైసిపి( YSR Congress ) హయాంలో నారా లోకేష్ ( Nara Lokesh)సాక్షి మీడియాకు టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచేవి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వ ఆగడాలపై లోకేష్ ప్రశ్నించేవారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని.. కూటమి అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తానని నారా లోకేష్ కౌంటర్ ఇచ్చేవారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. ఇదంతా లోకేష్ రెడ్ బుక్ ఫలితమేనని టాక్ వినిపిస్తోంది.
* సాక్షి రిపోర్టర్ కోసం ఆరా
తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు నారా లోకేష్. ఈ సందర్భంగా సాక్షి రిపోర్టర్( Sakshi reporter ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాక్షి రిపోర్టర్ వచ్చాడా అంటూ ఆరా తీసి.. ఆ మీడియా మైకును పట్టుకుని.. సాక్షి మీడియాపై సెటైర్లు వేశారు. మీ మేడం చాలా రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే ఆఫీస్ కి వచ్చారంటగా.. అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. గతంలో కూడా మీడియా సమావేశంలో సాక్షి గురించి ఇదే మాదిరిగా ఆరా తీసేవారు నారా లోకేష్.
* వైసీపీ శ్రేణుల ఆగ్రహం
అయితే లోకేష్ చర్యను తప్పు పడుతున్నారు వైసీపీ శ్రేణులు( YSR Congress cadre ). రాజకీయాల్లో నేతల భార్యల గురించి మాట్లాడుతూ.. వెటకారంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయవద్దని నారా లోకేష్ కు హితవు పలుకుతున్నారు. అయితే దీనిపై టిడిపి నేతలు సైతం కౌంటర్ అటాక్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సతీమణి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు ఈ నొప్పి తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి.
Nara Lokesh Ragging CEMENT AUNTY #Bharathi Reddy
— (@vibeofswetha) February 15, 2025