Nara Lokesh vs YS Jagan: ఒకప్పుడు వైయస్ జగన్ ను విమర్శించే క్రమంలో నారా లోకేష్ ఆభాసు పాలయ్యేవారు.. వైసిపి సోషల్ మీడియా కూడా లోకేష్ ను ఒక ఆట ఆడుకునేది. చినబాబు అని.. పప్పు అని.. మజ్జిగ తీయగా ఉందని ఇలా రకరకాలుగా విమర్శలు చేసేది. ఇప్పుడు ఆ విమర్శలకు లోకేష్ తావు ఇవ్వడం లేదు. అవకాశం ఇవ్వడం లేదు. అంతేకాదు అవకాశం దొరికితే వదిలిపెట్టడం లేదు. ఐదేళ్లు పూర్తిగా రాటు తేలిపోయాడు నారా లోకేష్. పైగా సామాజిక మాధ్యమాలను విపరీతంగా వినియోగించుకుంటూ వైసీపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ వైసీపీ అధినేతను విమర్శించారు టిడిపి యువ నేత.
తెలుగుదేశం పార్టీ యువ నేత కొత్త రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నప్పటికీ.. తనకంటూ బలమైన రాజకీయ పునాదిని వేసుకుంటున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అవకాశం కోసం కొత్త వాతావరణాన్ని సృష్టించుకోడానికి వెనుకాడటం లేదు. అందువల్లే నారా లోకేష్ చాలామందికి నచ్చుతున్నాడు. జనం మెచ్చే నాయకుడిగా ఎదుగుతున్నాడు. బహుశా ఇంతటి మార్పు టిడిపి నేతలు కూడా ఊహించి ఉండరు. ఆ మార్పును తన ఒంట పట్టించుకోని సరికొత్త రాజకీయాలు చేస్తున్నారు నారా లోకేష్.
పులివెందుల జడ్పిటిసి స్థానాన్ని కోల్పోయిన తర్వాత వైయస్ జగన్ తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఓటమికి సంబంధించి సమీక్ష కూడా నిర్వహించారు. నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఫలితం వస్తే.. ఎలా అని నేతల మీద మండిపడ్డట్టు తెలుస్తోంది. సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి.. రవీంద్రనాథ్ రెడ్డి.. ఇంకా కొంతమంది సీనియర్ నాయకులతో జగన్ చాలాసేపు భేటీ అయ్యారు. అయితే జగన్ వచ్చిన తర్వాత ఆయనను కలవడానికి కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ క్రమంలో తనను కలవడానికి కొంతమందికి మాత్రమే జగన్ అవకాశం ఇచ్చారు. వారికి పార్టీ నాయకులు పాస్ లు జారీ చేశారు..పాస్ లు మాత్రమే జగన్ ను కలిశారు.ఇదే విషయాన్ని ఓ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. దానిని ప్రముఖంగా పేర్కొంటూ లోకేష్ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ని కలవడానికి పాసులు ఇవ్వడం ఏంటని లోకేష్ మండిపడ్డారు. ఇది ఫ్యాన్ పార్టీ అధినేత స్టైల్ పరిపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
వైసిపి పాసుల వ్యవహారాన్ని ఓవర్గం మీడియా బలంగా ప్రచారం చేయడంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.. వాస్తవానికి ఎప్పుడు కూడా ఇటువంటి పాసుల వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ప్రోత్సహించలేదు. ఒకవేళ కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహించాలంటే.. ముందుగానే వర్తమానం పంపేవారు. వర్తమానం అందిన కార్యకర్తలతో మాత్రమే నాయకులు మాట్లాడేవారు. అంత తప్ప ఇలా పాసులు ఎన్నడూ ఇవ్వలేదు. దీనినే రాజకీయ విశ్లేషకులు తప్పు పడుతున్నారు.
ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ…. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! @ysjagan pic.twitter.com/0jGiccnL5A
— Lokesh Nara (@naralokesh) September 2, 2025