Minister Brother Assaults Police: అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి సోదరుడు పోలీసు అధికారిపై దాడికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి ఓ ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను మదన్ భూపాల్ రెడ్డి బూతులు తిట్టి, చెంపపై కొట్టడం వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వద్దకు మంత్రి సోదరుడు చేరుకుని అనూహ్యంగా రెచ్చగొట్టాడని, అనంతరం దౌర్జన్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత కానిస్టేబుల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: జగన్ కోసం అడవులు, కొండలు దాటి.. కోనలు దాటి.. వైరల్ వీడియోలు
ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దీనిపై పలు ప్రజాసంఘాలు, పోలీసు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ప్రభుత్వంలో ఉన్నవారికి చట్టం అంటే గౌరవం లేదా? విధిని నిర్వర్తిస్తున్న పోలీసుపై దాడి చేయడమా?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి , హోంమంత్రి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ప్రతిపక్షాలు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించాయి. “ఇవేనా కూటమి ప్రభుత్వంలో దౌర్జన్యాలు లేవంటూ చేసే మేధావుల మాటలు? పోలీసులను కూడా రక్షించలేని ప్రభుత్వం ప్రజల్ని ఎలా రక్షిస్తుందో?” అని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఎద్దేవా చేస్తున్నాయి.
Also Read: నెల్లూరుకు జగన్.. పోలీసుల్లో టెన్షన్!
ఈ ఘటనపై సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. బాధితుడైన కానిస్టేబుల్ ఫిర్యాదుతో పాటు వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సంఘటన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు, ప్రతిపక్షాల నుండి ప్రశ్నలకు దారితీసింది.
దీనిపై స్పందించండి పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు @APPOLICE100
నంద్యాల జిల్లా…..బనగానపల్లెడ్యూటీ నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ జస్వంత్ కు చెంప చెల్లుమనిపించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి. pic.twitter.com/7gLU3PtYTo
— Voice Of Y. Palem✊ (@Jagan3535) July 31, 2025