Homeక్రీడలుDhoni Marriage Advice : పెళ్లంటే నిప్పుతో చెలగాటం.. భార్యతో ఎలా ఉండాలంటే? ధోని చెప్పిన...

Dhoni Marriage Advice : పెళ్లంటే నిప్పుతో చెలగాటం.. భార్యతో ఎలా ఉండాలంటే? ధోని చెప్పిన ‘జీవిత సత్యాలు’

Dhoni Marriage Advice: మిస్టర్‌ కూల్‌.. హెలిక్యాప్టర్‌ షాట్‌ స్పెషలిస్ట్‌.. జార్ఖండ్‌ డైనమైట్‌.. పేరు ఏదైనా.. అతను ఒక్కడే. అభిమానులు ముందుగా ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న గ్రేట్‌ మ్యాన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా.. ఐపీఎల్‌లో ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు. ధోనీ కేవలం క్రికెట్‌ కెప్టెన్‌ మాత్రమే కాదు, ఒత్తిడిలో సమచిత్తంతో విజయాలు సాధించే వ్యక్తిత్వం. ఆటలోనే కాక, జీవితంలోనూ అతని ప్రశాంతత, హాస్యం అభిమానులను ఆకర్షిస్తాయి. ధోనీకి భార్య, కూతురు ఉన్నారు.

Also Read: పహల్గాం రక్తం తాగిన పాకిస్తాన్ తో క్రికెటా? బీసీసీఐ ఏంటిది?

క్రికెట్‌లో తనదైన ఆధిపత్యం..
ధోని క్రికెట్‌ రంగంలో సాధించిన విజయాలు అసమానమైనవి. 2004 నుంచి 2019 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధోని, 350 వన్డేలు, 90 టెస్ట్‌ మ్యాచ్‌లు, 98 టీ20లలో ఆడాడు. వన్డేల్లో 10,773 పరుగులు, టెస్టుల్లో 4,876, టీ20లలో 1,617 పరుగులు అతని స్థిరత్వాన్ని చాటుతాయి. ధోని నాయకత్వంలో భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను (2007 టీ20 వరల్డ్‌ కప్, 2011 వన్డే వరల్డ్‌ కప్, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది, ఇది ఏ భారత కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనత. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ధోని, 278 మ్యాచ్‌లలో 5,439 పరుగులతో తన నాయకత్వ, ఆట నైపుణ్యాలను చాటాడు.

మిస్టర్‌ కూల్‌..
ధోని అతిపెద్ద బలం అతని ప్రశాంతత. ఓటమి సమీపంలో ఉన్న సందర్భాల్లోనూ, అతను ఒత్తిడిని ఎదుర్కొని, ప్రత్యర్థులను చిత్తు చేశాడు. ఈ లక్షణం అతన్ని ‘మిస్టర్‌ కూల్‌’గా అభిమానుల మనసులో నిలిపింది. ఆటలోనే కాక, వ్యక్తిగత జీవితంలోనూ ఈ సమచిత్తం కనిపిస్తుంది. భార్య సాక్షి సలహాలను ఆలకించడం ద్వారా వైవాహిక జీవితంలో సమతుల్యత సాధించినట్లు ధోని చెబుతాడు.

Also Read: నిజమైన దేశభక్తి అంటే మీదే.. నిజంగా ‘లెజెండ్స్’ అనిపించుకున్నారు

ధోనీ జీవిత సత్యాలు..
ఒక వివాహ వేడుకలో ధోని హాస్యంతో కూడిన సలహాలు అందరినీ ఆకర్షించాయి. ‘‘వివాహం నిప్పుతో చెలగాటం లాంటిది, కొందరు ఆరాటపడతారు’’ అంటూ వరుడిని ఉటంకిస్తూ నవ్వులు పూయించాడు. భర్తల కోపం ఐదు నిమిషాల్లోనే చల్లారుతుందని, ఆ సమయంలో స్త్రీలు నిశ్శబ్దంగా ఉంటే సమస్యలు తగ్గుతాయని ధోని సరదాగా సలహా ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోని 2010లో సాక్షి సింగ్‌ రావత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ధోనీకి 2015లో కూతురు జీవా జన్మించింది. ధోని జీవితంలో సరళత, కుటుంబ ప్రాధాన్యత అతని వ్యక్తిత్వానికి మరో కోణాన్ని జోడిస్తాయి. ఆట ఒత్తిడి నుంచి వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం అతని విజయ రహస్యం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version