Michaung Cyclone: తీరం దాటిన తుఫాను.. దంచి కొడుతున్న వర్షాలు

తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంది.

Written By: Dharma, Updated On : December 5, 2023 6:19 pm

Michaung Cyclone

Follow us on

Michaung Cyclone: తీవ్ర తుఫాను మిచాంగ్ బాపట్ల సమీపంలో తీరం దాటింది. ఎంతో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మరో రెండు గంటల్లో తుఫానుగా బలహీన పడనుంది. అనంతరం ఆరు గంటల్లో వాయుగుండం గా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో వర్ష తీవ్రత అధికంగా ఉంది. రాయలసీమ జిల్లాల్లో సైతం తుఫాను ప్రభావం ఉంది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరా నిలిచిపోయింది.

కాగా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితులు ఇంటికెళ్లినప్పుడు ప్రతి ఒక్కరికి రూ.1000 లేదా కుటుంబానికి రూ.2500తో పాటు నిత్యవసర సరుకులు అందించాలని ఆదేశించారు. తక్షణం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని.. మనుషులు, పశువులు చనిపోతే 48 గంటల్లోనే పరిహారం అందించాలని.. పంట నష్టం అంచనాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు. కాగా తుఫాను దృష్ట్యా రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలనివిద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.