Site icon OkTelugu

IPL 2024: ఐపిఎల్ కోసం కేకేఆర్ వేసిన ప్లాన్ మామూలు గా లేదు గా…

IPL 2024

IPL 2024

IPL 2024: 2024 ఐపిఎల్ కోసం ప్రతి టీం కూడా తనదైన రీతిలో కసరత్తులను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు అన్ని టీములు తనదైన రీతిలో చాలా మంది ప్లేయార్లను ఆక్షన్ లోకి వదిలేసి, ఇప్పుడు కొత్త ప్లేయర్ల మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే కలకత్తా టీమ్ కూడా ఆ టీమ్ లో ఉన్న కొంత మంది ప్లేయర్లను వదిలేసి కొత్త టాలెంట్ కోసం వెతుకుతుంది.ఇక అందులో భాగంగానే ట్రావెస్ హెడ్ ని టార్గెట్ చేసి అతని కోసం ఎన్ని కోట్లు అయిన సరే పెట్టడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇతని తోపాటు గా మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన మిచెల్ స్టార్క్ ని కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఇక 2023 సీజన్ లో ఈ టీమ్ అంత మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే కలకత్తా టీమ్ కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా టీమ్ కి దూరం అయ్యాడు. దాంతో నితీష్ రాణా సారథ్యం లో కలకత్తా టీమ్ బరిలోకి దిగింది. ఇక ఈ టీమ్ అంత పెద్ద పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేక పోయింది. ఇక దాంతో కలకత్తా సెమీస్ కి వెళ్ళకుండానే నిష్క్రమించింది. ఇక దాంతో ఇప్పుడూ ఎలాగైనా సరే కప్పు కొట్టి చూపించాలనే ఉద్దేశ్యంతోనే కలకత్తా టీమ్ యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకసారి కప్పు కొట్టి కలకత్తా మరోసారి వాళ్ల స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.

ఇక అందుకే ఇప్పుడు సరికొత్త ప్రణాళిక తో ముందుకు కదలడానికి సిద్ధమవుతుంది. ఇక కలకత్తా టీమ్ కెప్టెన్ అయిన శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనని కనక ఐపిఎల్ వరకు అలానే కంటిన్యూ చేస్తే కలకత్తా ఈసారి కప్పు పక్కగా కొడుతుంది… అయితే ఇంతకు ముందు కలకత్తా కి గంభీర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కప్పు వచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి కప్పు రాలేదు ఇక ఇప్పటి వరకు కేవలం రెండు సార్లు మాత్రమే కలకత్తా కప్పు కొట్టింది.

ఇక అందుకే ఇప్పుడు కూడా కప్పు కొట్టి మూడోవ సారి కప్పు కొట్టిన టీమ్ గా నిలవాలని చూస్తుంది…అందుకే ప్లేయర్ల ఎంపిక లో చాలా జాగ్రత్త గా ఉంటూనే కప్పు కొట్టడానికి కావాల్సిన అన్ని కసరత్తులు సిద్దం చేస్తుంది…ఇక ఈ టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా నిలకడ గా ఆడుతూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటే ఈజీగా ఈసారి కప్పు గెలవచ్చు…

Exit mobile version