Megastar Chiranjeevi: జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం నిన్న పిఠాపురం అట్టహాసంగా జరిగింది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుండి కూడా భారీ ఎత్తున జనాలు తరళి వచ్చారు. జనసేన పార్టీ(Janasena Party) శ్రేణులు అందిస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 7 లక్షల మంది జనాలు వచ్చారని తెలుస్తుంది. సుమారుగా 70 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ సభా స్థలంలో, గ్రౌండ్ మొత్తం 5 లక్షల మంది జనసైనికులతో నిండిపోగా, సభలోకి అడుగుపెట్టలేక బయట ఆగిపోయిన జనాల సంఖ్య రెండు లక్షల వరకు ఉంటుందని సమాచారం. మొత్తం మీద 7 లక్షల మంది జనాలు హాజరైనట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సభలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అనేక అంశాలపై మాట్లాడాడు. తనని కొంతమంది లెఫ్ట్ సిద్ధాంతం నుండి రైట్ సిద్ధాంతానికి మారినట్టు చెప్పడం పై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.
అంతే కాకుండా సనాతనం ధర్మం గురించి, మూడు బాషల సమస్య గురించి, ఇలా ఎన్నో సున్నితమైన అంశాల గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆయన ప్రసంగం పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతృప్తి చెందారు కానీ, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసారు. కారణం ఏమిటంటే పవన్ కళ్యాణ్ నాలుగు దశాబ్దాల తెలుగు దేశం పార్టీ ని మనం నిలబెట్టాం అని మాట్లాడడం, పిఠాపురం వర్మ కి నాగబాబు పరోక్షంగా కౌంటర్లు ఇవ్వడం వంటివి తెలుగు తమ్ముళ్లకు నచ్చలేదు. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. వైసీపీ పార్టీ కి వీళ్ళ మధ్య జరిగే గొడవలు కాలక్షేపణాన్ని ఇస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేసాడు.
ఆయన మాట్లాడుతూ ‘మై డియర్ తమ్ముడు కళ్యాణ్ బాబు, జనసేన జయకేతన సభలో నీ ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యాను. సభకు వచ్చిన అశేష జనసముద్రం లాగానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ప్రస్తావన ని తీసుకొని రాని చిరంజీవి, ఈమధ్య కాలం లో రిపీట్ గా జనసేన పార్టీ ప్రస్తావన తీసుకొని రావడం ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మెగా అభిమానులు సంతోషంగానే ఉన్నప్పటికీ, దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025