Homeఆంధ్రప్రదేశ్‌Magic Drains: మ్యాజిక్ డ్రైన్స్.. ఏపీ గ్రామాలు, పట్టణాలకు గేమ్ చేంజర్ అవ్వబోతోందా?

Magic Drains: మ్యాజిక్ డ్రైన్స్.. ఏపీ గ్రామాలు, పట్టణాలకు గేమ్ చేంజర్ అవ్వబోతోందా?

Magic Drains: ఏపీ ప్రభుత్వం( AP government ) మరో వినూత్న ఆలోచన చేసింది. ఇకనుంచి గ్రామాలతో పాటు పట్టణాల్లో మురుగునీటి సమస్య లేకుండా చూడాలని చూస్తోంది. ప్రధానంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రోగాలు ప్రబలుతున్నాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. అదే సమయంలో ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం పడుతోంది. అన్ని సమస్యలకు మురుగు నీరే కారణమని గుర్తించింది ప్రభుత్వం. దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇంట్లో నుంచి వచ్చే మురుగునీరు వెంటనే భూమిలోకి ఇంకెలా ఈ మ్యూజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సోమవరం లో నిర్మించారు కూడా. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో సైతం వీటి నిర్మాణం చేపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మంచి ఫలితం ఇవ్వడంతో ఇప్పుడు గుంటూరులో కూడా నిర్మిస్తున్నారు. క్రమేపి రాష్ట్రవ్యాప్తంగా వీటిని నిర్మాణాన్ని విస్తరించనున్నారు.

AP Drains

* ఆ అధికారిని ఏరి కోరి తెప్పించుకున్న పవన్..
ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) ఉన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ తరుణంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధిలో తనకంటూ ఒక ముద్ర చూపించిన ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను గుర్తించారు. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి కృష్ణ తేజను ఏపీకి రప్పించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ఉన్నారు కృష్ణ తేజ. అందుకే ఆ శాఖలో వినూత్న అంశాలను తెరపైకి తెస్తున్నారు. ఈ తరుణంలోనే మ్యాజిక్ డ్రైన్లు ఆలోచన చేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు లో గత సంవత్సరం భారీ వర్షాలు కురిసాయి. దీంతో వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండిపోయింది. దోమలు అధికమై విష జ్వరాలు, నీరు కలుషితమై డయేరియా సోకింది. వీధుల్లో నిర్మించిన సిమెంట్ రోడ్ల పక్కన మురుగునీరు వెళ్లేందుకు కాలువలు నిర్మించలేదు. అయితే ఈ పరిస్థితిని గుర్తించిన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కొలకలూరు లో మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం చేపట్టే పనిలో ఉంది. అయితే పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పల్లెలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అయితే ఇప్పటికే పట్టణాల్లో మ్యాజిక్ డ్రైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు గ్రామాల్లో సైతం వీటిని నిర్మిస్తుండడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ సూచనతో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఈ డ్రైన్ల నిర్మాణానికి సంకల్పించడం విశేషం.

* మురుగు నీటి కోసం..
సాధారణంగా ఇళ్లల్లో నుంచి వాడుకనీరు, వ్యర్ధాల నీటిని బయటకు విడిచిపెడతారు. కాలువలు ఉంటే పర్వాలేదు. లేకుంటే ఇంటి సమీపంలో ఖాళీ ప్రదేశంలో మురుగునీరు నిల్వ ఉండిపోతుంది. అందుకే ఇళ్లల్లో నుంచి వచ్చే వ్యర్థపు నీరు నేరుగా భూమిలో ఇంకెలా మ్యాజిక్ డ్రైన్( magic drain ) నిర్మిస్తారన్నమాట. సిమెంట్ రోడ్డు పక్కన, సమాంతరంగా మురుగు కాలువల స్థానంలో మూడు కిలోమీటర్ల మేర డ్రైన్ నిర్మిస్తారు. ఇళ్లల్లో నుంచి ఈ డ్రైన్ లోకి చేరిన నీరు అక్కడ నుంచి మరోచోటకు పారకుండా ఉండేందుకుగాను ఒకటిన్నర మీటర్ల లోతు ఉండేలా.. రోడ్డుకు పక్కనున్న ప్రదేశంలో ఈ డ్రైన్ నిర్మాణం చేపడతారు. ప్రతి 50 మీటర్లకు ఒక ఇంకుడు గుంత తవ్వుతారు. అందులో కంకర రాళ్లు నింపి.. పైన చిప్స్ అమర్చుతారు. దీంతో మురికి నీరు ఇంకుడు గుంతలో చేరిన తరువాత వడపోతకు గురై.. భూమిలో ఇంకుతుంది. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని అంచనాలు ఇస్తున్నారు. సాధారణంగా ఏర్పాటు చేసి కాంక్రీట్ ఛానల్ డ్రైనేజీ వ్యవస్థతో పోల్చితే.. మ్యాజిక్ డ్రైన్ల ద్వారా ఇళ్లల్లో నుంచి వచ్చే మురుగునీరు నేరుగా భూమిలోకి ఇంకుతుంది. వాటితో పోల్చుకుంటే ఖర్చు కూడా తక్కువే.

*మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?*
సాధారణంగా మన ఇళ్లలోంచి వచ్చే మురుగునీరు రోడ్డు పక్కన ఉండే డ్రైనేజీ కాలువలలోకి వెళ్లి అక్కడే నిలిచిపోయి దోమలకు నిలయంగా మారుతుంది. దీనివల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కానీ మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థలో ఇలాంటి సమస్య ఉండదు.

నిర్మాణం: సిమెంట్ రోడ్డుకు పక్కన ఒక మీటరు లోతు, ఒక మీటరు వెడల్పుతో గొయ్యి తవ్వి, అందులో కంకర రాళ్లు మరియు ఇసుక నింపుతారు. దీనిపై ఒక ఫిల్టర్ పొరను ఏర్పాటు చేస్తారు.

నీటి నిర్వహణ: ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు ఈ డ్రైన్లలోకి చేరుతుంది. ఈ డ్రైన్లోని కంకర మరియు ఇసుక పొరల గుండా నీరు వడపోతకు గురై స్వచ్ఛమైన నీరుగా మారి భూమిలోకి ఇంకిపోతుంది.

*మ్యాజిక్ డ్రైన్స్ వల్ల ప్రయోజనాలు*

మురుగునీరు నిల్వ ఉండదు: నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోవడంతో దోమలు, ఈగలు పెరగవు.

భూగర్భ జలాల పెంపు: ఇది మురుగునీటిని రీసైకిల్ చేసి భూమిలోకి పంపడం వల్ల భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది.

ఆరోగ్యం మెరుగుపడుతుంది: పారిశుధ్యం మెరుగుపడడం వల్ల విషజ్వరాలు, డయేరియా వంటి వ్యాధులు తగ్గుతాయి.

తక్కువ ఖర్చు: సాధారణ కాంక్రీట్ డ్రైనేజీలతో పోలిస్తే, ఈ మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ఖర్చు తక్కువ.

*ఏపీకి మ్యాజిక్ డ్రైన్స్ ఒక గేమ్ చేంజర్ అవుతాయా?*

ఈ ప్రాజెక్ట్ ఏపీలోని గ్రామాలు, పట్టణాలకు గేమ్ చేంజర్ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే..

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి: పల్లెల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ మ్యాజిక్ డ్రైన్ల ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం: ఈ వ్యవస్థ తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుంది.

ప్రజారోగ్యం: మురుగునీటి సమస్య వల్ల వచ్చే రోగాల భారం తగ్గుతుంది, ఫలితంగా ప్రజారోగ్యం మెరుగుపడుతుంది.

పర్యావరణానికి మేలు: ఈ వ్యవస్థ ద్వారా నీరు వృధా కాకుండా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇది పర్యావరణానికి చాలా మంచిది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లెలతో పాటు పట్టణాల్లో మ్యాజిక్ డ్రైన్లు అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం. అదే జరిగితే గేమ్ చేంజర్ గా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజకు ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version