Jabardasth: టెలివిజన్ రంగంలో పెను సంచలనాన్ని సృష్టించి టాప్ పిఆర్పి రేటింగ్ ను సంపాదించుకున్న కామెడీ షో జబర్దస్త్…ఈ షో స్టార్ట్ చేసి 12 సంవత్సరాలకు పైన అవుతున్నప్పటికి ఇప్పటివరకు మంచి రేటింగ్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇక మల్లెమాల వాళ్ళు నిర్వహిస్తున్న ఈ షోలో చాలామంది కంటెస్టెంట్లు టీం లీడర్లుగా మారి, ఆ తర్వాత సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్,గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వాళ్ళు సినిమాల్లో అవకాశాలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి కమెడియన్స్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు జబర్దస్త్ షో శుక్రవారం, శనివారం టీవీలో టెలికాస్ట్ అవుతోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ వారం ఈ షోలో చాలా కామెడీ స్కిట్స్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తున్నాయి.
ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా ఈ వారం అయితే చాలా స్పెషల్ గా మారబోతుంది. ఇక రాకింగ్ రాకేష్ తన వైఫ్ అయిన సుజాత తో కలిసి కొన్ని రోజులుగా స్కిట్లు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంకా ఇప్పుడు వీళ్లకు తోడుగా ప్రవీణ్ లేడీ గెటప్ వేసుకొని మరి రాకేష్ మీద పంచుల వర్షాన్ని కురిపిస్తున్నాడు.
ఈవారం టెలికాస్ట్ అవ్వబోతున్న ప్రోమోని కనక మనం చూసినట్లయితే ఇందులో చాలా వరకు పంచులైతే ఉన్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ లో ఏదైతే మిస్ అవుతూ వస్తుందో అది రాకింగ్ రాకేష్ ద్వారా ఈ ఎపిసోడ్ లో చాలా మంచి ఫన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇప్పటివరకు జబర్దస్త్ షో టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది. అయితే గత కొద్దిరోజుల నుంచి ఈ షో కి అనుకున్నంత టిఆర్పి రేటింగ్ అయితే రావడం లేదట.
కానీ ఈ వారం మాత్రం అంతకు మించిన టిఆర్పి రేటింగ్ రాబోతుందని షో యాజమాన్యం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే జబర్దస్త్ షో ద్వారా చాలామంది నటులకు మంచి అవకాశాలైతే వచ్చాయి. అలాగే జబర్దస్త్ షో చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉండడం విశేషం…