
చిత్తూరు జిల్లా మదనపల్లెలో కన్నబిడ్డలనే తల్లిదండ్రులు హతమార్చిన ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికగా భావించుకుంటున్న పద్మజ.. పెద్ద కూతురు అలేఖ్యను చంపిన తరువాత ఆమె నాలుకను తినేసిందని పురుషోత్తం పోలీసుల విచారణలో తెలిపాడు. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య చెప్పేదని.. అన్నాడు. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ పనికాదు.. పాండవుల తరఫున అర్జునుడు ముందుండి నడిపిన పోరాట స్పూర్తని కొనసాగించాలని అలేఖ్య చెప్పిందని పురుషోత్తం వివరించాడు. కలియుగం అంతమై.. సత్యయుగం వస్తోందని.. అలేఖ్య అనేదని.. కరోనా కూడా ఇందులో భాగమేనని చెప్పదని అన్నాడు.
Also Read: తెలంగాణకు రూ.250 కోట్లు.. ఏపీకి నిల్..!: కేంద్రం వరద సాయం
పురుషోత్తం.. పద్మజలకు మానసిన వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.. వారికి జైలులాంటి వాతావరణంలో చికిత్స అందించాలి.. అందుకే విశాఖలోని ప్రభుత్వ మానసిక చికిత్స కేంద్రానికి సిఫారసు చేసినట్లు తిరుపతి రుయా వైద్య నిపుణులు తెలిపారు. పద్మజ మంత్రాలు పటిస్తూ.. తన బిడ్డలు తిరిగి వస్తున్నారి.. ఇంటికి వెళ్లాలని .. జైలులో శివయ్యకు తోడుగా ఉన్న కృష్ణయ్య ఇక్కడ కనిపించడం లేదని అంటూనే వైద్యులకు సమాధానం చెప్పారు.
Also Read: ఆడపిల్ల పుడితే 10వేల రూపాయలు డిపాజిట్.. ఎక్కడంటే..?
పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించారు. ఆమె తండ్రికూడా 20ఏళ్లుగా మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడని తెలిసింది. పద్మజ మేనమాన కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డాడని.. వంశపారంపర్యంగా.. పద్మజకు.. ఆమె కూతురు అలేఖ్యకు ఇది సంక్రమించి ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. అలేఖ్య ఫేసు బుక్కు.. శుక్రవారం బ్లాక్ అయ్యింది. ఇనిస్టాగ్రాం.. నడుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
చెల్లి చచ్చిపోతానంటే.. అక్క ఆమెను ప్రోత్సహించింది. అలాంటి ఆలోచన సరికాదని.. మొదట్లో తల్లిదండ్రలు సర్ది చెప్పినా.. చివరకు మూఢ విశ్వాసం మైకంలోకి వెళ్లిపోయారు. ఘోరమైన హత్యలకు పాల్పడ్డారు. అలేఖ్య బోపాల్లో చదువుతుండగా.. అక్కడ పలువురు ప్రభోదకుల ప్రసంగాలు.. రచనలకు ఆకర్షితులైంది. నిరంతరం వాటి అధ్యయనంలో మునిగి తేలుతూ.. చివరికి భ్రమల్లోకి వెళ్లింది. తనలా అమ్మాయి రూపంలో శివుడు రావడం అరుదని భావించిన అలేఖ్య అదే విశ్వాసాన్ని తల్లిదండ్రుల్లో కలిపించేందుకు ప్రయత్నించింది. గతంలో తాను కుక్కను చంపి మళ్లీ బతికించినట్లు చెప్పినట్లు తెలిసిది. హత్యకు కొద్దిరోజుల ముందు.. విచిత్రంగా ప్రవర్తిస్తూ.. తాను చచ్చిపోతానంటూ.. సాయిదివ్య కేకలు వేస్తుంటే.. అలేఖ్య మద్దతు పలికేది.