Lokesh Pawan Controversy: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. టిడిపి నేతృత్వంలోని కూటమి ముందుకు సాగుతోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపిస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కు సైతం ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ కావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. దీంతో ఇది ఒక వివాదంగా మారింది. అయితే రెండు పార్టీల నాయకత్వాల ఆదేశాలతో పార్టీల శ్రేణులు సైలెంట్ అయ్యాయి. మరోవైపు లోకేష్ తో పవన్ విభేదిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి ఎప్పటికప్పుడు చెక్ చెబుతూ వచ్చారు ఆ ఇద్దరు నేతలు.
Also Read: జగన్ ఓడిపోతారని నేను ఊహించలేదు.. కేటీఆర్ కామెంట్స్ వైరల్!
పవన్ పిలుపుతో..
తాజాగా పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఇచ్చిన సవాల్ ను స్వీకరించారు మంత్రి నారా లోకేష్. అటవీ శాఖ మంత్రిగా వినూత్న మార్పులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. తీర ప్రాంత పరిరక్షణకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కూడా పిలుపునిచ్చారు. అయితే దేశవ్యాప్తంగా ఈ మొక్కల నాటడానికి సంబంధించి నినాదం పతాక స్థాయిలో వినిపిస్తోంది. అమ్మకు గుర్తుగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును అనుసరించి ఏపీలో కోట్లాది మొక్కలు నాటడానికి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అటవీశాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కోట్లాది మొక్కలు నాటాలని సవాల్ విసిరారు.
Also Read: మళ్లీ యశోధ ఆస్పత్రికి కేసీఆర్.. ఏమైంది?
విద్యాశాఖ తరఫున కోటి మొక్కలు..
ఈరోజు సత్యసాయి జిల్లా( Sathya Sai district ) కొత్తచెరువు పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు సైతం హాజరయ్యారు. ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడారు. పవన్ అన్న పిలుపుమేరకు విద్యాశాఖ తరఫున కోటి మొక్కలు నాటుతామని చెప్పుకొచ్చారు. ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ ఇస్తామని.. మూడేళ్లలో మొక్క నాటడమే కాకుండా వాటి సంరక్షణ సంబంధిత విద్యార్థి చూసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విసిరిన సవాల్ స్వీకరించారు నారా లోకేష్. ప్రస్తుతం నారా లోకేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: లోకేశ్
అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు
ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ సవాల్ విసిరారు.
ఆయన సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా.. విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం
– మంత్రి… pic.twitter.com/soy85AVRmD
— ChotaNews App (@ChotaNewsApp) July 10, 2025