https://oktelugu.com/

Nara Lokesh: విశాఖకు గూగుల్.. ఒప్పించే పనిలో లోకేష్!

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్న వ్యూహంలో కూటమి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా విశాఖ కు పెద్ద ఎత్తున ఐటీ సంస్థలను తీసుకొచ్చే పనిలో పడింది. ఆ బాధ్యతలు మంత్రి లోకేష్ పై పడ్డాయి.

Written By:
  • Dharma
  • , Updated On : October 31, 2024 / 12:48 PM IST

    Nara Lokesh(2)

    Follow us on

    Nara Lokesh: మంత్రి నారా లోకేష్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఏపీకి రప్పించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్ని వర్కౌట్ అయ్యేలా ఉన్నాయి.ప్రస్తుతం అమెరికాలో ఎన్నికల వాతావరణం ఉంది. అయినా సరే లోకేష్ తనవంతు ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. అయితే లోకేష్ పర్యటనలో ఎక్కడ హంగు ఆర్భాటాలు కనిపించడం లేదు. చాలా సింపుల్ గా తన బృందంతో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు అవుతూ వచ్చారు.ఇప్పటికే మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అనుకూలమైన వాతావరణం ఏపీలో ఉందని.. అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టెస్లా సి ఎఫ్ ఓ తో సైతం చర్చలు జరిపారు లోకేష్. అనంతపురంలో కియో మోటార్ల తరహాలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి టెస్లా సిఎఫ్ఓ సానుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు ప్రపంచ దిగ్గజ గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు లోకేష్. విశాఖలో డేటా క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ క్యాంపస్ ను లోకేష్ సందర్శించారు. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కొరియన్, గ్లోబల్ నెట్వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కాలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ఫారం వైస్ ప్రెసిడెంట్ రావు సూరపనేని, గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్ చందు తోట తో సమావేశం అయ్యారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా మారుతోందని.. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటు పై దృష్టి సారించాలని లోకేష్ వారికి విజ్ఞప్తి చేశారు.

    * ఏపీ పరిస్థితులపై నివేదిక
    ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పారిశ్రామికవేత్తలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్. ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించి చంద్రబాబు సర్కార్ విధానాలను వారి ముందు ఉంచుతున్నారు. ప్రధానంగా ఏఐ ఆధారిత ఈ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. స్టార్ట్ సిటీల్లో జియోస్ ఫేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైం ట్రాఫిక్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్ తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని లోకేష్ తాజాగా ప్రతిపాదించారు. దీనిపై గూగుల్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

    * సహకరిస్తున్న తెలుగు ప్రముఖులు
    అయితే మంత్రి లోకేష్ అమెరికా పర్యటనను అక్కడ తెలుగువారు ఎంతగానో ఆహ్వానిస్తున్నారు. తమ వంతు సహకారం అందిస్తున్నారు. పారిశ్రామిక దిగ్గజాలతో లోకేష్ సమావేశం కావడం వెనుక వారి కృషి ఉంది. అక్కడి తెలుగు సంఘాల సాయాన్ని సైతం తీసుకుంటున్నారు లోకేష్. మొత్తానికైతే లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుండడం విశేషం.