Lokesh Delhi Tour Highlight: ఏపీ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh)గత రెండు రోజులుగా ఢిల్లీలో బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఏపీకి సంబంధించి ప్రాజెక్టుల గురించి చర్చిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈరోజు యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో లోకేష్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగంపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం గ్లోబల్ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియాతో సమావేశం అయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, క్రీడాభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఢిల్లీ వచ్చారు. ఆయనతో భేటీ అయ్యారు నారా లోకేష్. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగాలు గురించి ఆ ఇద్దరు చర్చించారు.
Also Read: Nara Lokesh : లోకేష్ టీం రెడీ.. ఎవరెవరు అంటే?
రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయనున్న టిబిఐ
రాష్ట్ర ప్రభుత్వంతో టోనీ బ్లేయర్ కు( Tony Blair) చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ పనిచేయనుంది. సాంకేతికంగా సహాయం అందించనుంది. ఈ అంశాల గురించి లోకేష్ టోని బ్లేయర్ తో చర్చించారు. టోనీ బ్లేయర్ ను గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాలని ఆహ్వానించారు. అయితే వచ్చే ఆగస్టులో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సులు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లేయర్ చెప్పారు. అదే జరిగితే ఏపీ అభివృద్ధిలో ఇదో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు లోకేష్. టోనీ బ్లేయర్ తో భేటీ ఆసక్తికరంగా సాగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Nara Lokesh: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!
ఢిల్లీలో బిజీబిజీ..
రెండు రోజుల కిందట ఢిల్లీ( Delhi) చేరుకున్న లోకేష్ బిజీబిజీగా గడిపారు. నిన్న రోజంతా కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తూ వచ్చారు. ఈరోజు టోనీ బ్లేయర్ తో భేటీకి ముందు కేంద్రమంత్రి మన్షుక్ మాండవియాను కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు రేపటి వరకు లోకేష్ ఢిల్లీలోనే ఉండనున్నారు. అక్కడ నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా హాజరవుతారు. 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.