https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ బుడ్డోడు .. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో!

అలాగే అనసూయ తో చేసిన ' థాంక్యూ బ్రదర్ ' మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గతంలో విరాజ్ అశ్విన్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 7, 2024 / 05:36 PM IST

    This buddo next to Pawan Kalyan is now a crazy hero of Tollywood!

    Follow us on

    Pawan Kalyan : ఫోటోలో పవన్ కళ్యాణ్ పక్కన నిల్చుని ఉన్న ఈ చిన్న పిల్లాడు ఎవరో గుర్తు పట్టగలరా. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో. అంతేకాదు పలు సినిమాల్లో కీలకమైన సహాయక పాత్రల్లో నటించి మెప్పించాడు. ఫోటో చూసి గుర్తు పట్టడం కాస్త కష్టమే కానీ .. పేరు చెబితే ఈ యంగ్ హీరో ని టక్కున గుర్తు పట్టేస్తారు. ముఖ్యంగా యూత్ లో అతనికి పిచ్చ క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో తాజాగా అతను షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతుంది.

    టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కుర్ర హీరోలకు పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చిన ఎంతోమంది ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ఘన విజయం సాధించారు.

    ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. నితిన్, సాయి ధరమ్ తేజ్ వంటి యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ ని ఎంతో అభిమానిస్తారు. అలా పైన ఫోటోలో ఉన్న యంగ్ హీరో కి కూడా పవన్ కళ్యాణ్ అమితమైన ప్రేమ. అతను చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఆ చిన్న పిల్లాడు మరెవరో కాదు ‘ బేబీ’ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన విరాజ్ అశ్విన్.

    బేబీ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విరాజ్ అశ్విన్. ఆ తర్వాత సోలో హీరోగా ‘ మాయా పేటిక ‘ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని హీరోగా వచ్చిన ‘ హాయ్ నాన్న ‘ సినిమాలో కీలక పాత్ర చేశాడు. అలాగే అనసూయ తో చేసిన ‘ థాంక్యూ బ్రదర్ ‘ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గతంలో విరాజ్ అశ్విన్ పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.