Liquor Truck Anakapalli Accident: మద్యం( liquor) ఉచితంగా వస్తే ఎవరికి వద్దు. మందు తాగని వారు సైతం తీసుకొని తమ సన్నిహితులకు ఇచ్చే రోజులు ఇవి. అటువంటిది రహదారిపైనే మద్యం దొరికితే.. దొరికిన వారు దొరికినంతగా తీసుకెళ్తారు. అటువంటి ఘటనే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో వెలుగు చూసింది. రహదారిపై మద్యంతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అందులో ఉన్న లక్షలాది రూపాయల విలువ చేసే మద్యం రహదారిపై పడింది. బాటిల్లు చెల్లాచదురుగా పడ్డాయి. వాటిని ఏరుకునేందుకు ప్రజలు బారులు తీరారు. సమీపంలో ఉన్నవారు, అదే రహదారిపై వస్తున్న వారు.. ఇలా ఒక్కరేమిటి అంతా గుమిగూడారు. చేతికి ఏ బాటిల్ అందితే ఆ బాటిల్ తో పరారు అయ్యారు.
Also Read: Road Accident: కారును ఢీకొట్టిన బస్సు.. ముగ్గురి మృతి
మద్యం తీసుకెళ్తుండగా
అనకాపల్లి జిల్లా( Anakapalli district) అచ్యుతాపురం మండలంలోని ఓ మద్యం దుకాణానికి సంబంధించి మద్యం స్టాక్ తీసుకెళ్తున్న వాహనం రహదారికి అడ్డంగా బోల్తా పడింది. అనకాపల్లిలోని బేవరేజెస్ యూనిట్ నుంచి బయలుదేరిన ఆ వాహనం కొండకర్ల కూడలి సమీపంలోకి వచ్చేసరికి రహదారికి అడ్డంగా బోల్తాపడింది. రోడ్డుపై వస్తున్న ఆవును తప్పించే క్రమంలో ఆ వాహనం బోల్తా పడినట్లు తెలుస్తోంది. మితిమీరిన వేగంతో వస్తున్న ఆ వాహనం బోల్తాపడడంతో రోడ్డుపై మద్యం సీసాలు పడ్డాయి. చాలావరకు ధ్వంసమయ్యాయి. అయితే ఆ సమయంలో సమీపంలో ఉన్నవారు రోడ్డుపైకి వచ్చి బీర్లు, ఖరీదైన మద్యం సీసాలను ఏరుకోవడం కనిపించింది. లక్షల రూపాయల మద్యం ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానికులు బీరు సీసాలను ఏరుకునే క్రమంలో ఆ వాహన సిబ్బంది అదుపు చేయలేకపోయారు. చాలా వరకు మద్యం చోరీకి గురైనట్లు తెలుస్తోంది.
మొన్న ఆ మధ్యన విశాఖ నగరంలో
మొన్న ఆ మధ్యన విశాఖ నగరంలోని( Visakhapatnam City) కొమ్మాది జంక్షన్ లో ఇదే మాదిరిగా ఓ భారీ వాహనం రహదారికి అడ్డంగా బోల్తా పడింది. మద్యం తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అప్పట్లో కూడా భారీగా మద్యం చోరీకి గురైంది. నచ్చినోడికి నచ్చినంత మద్యం అన్నట్టు రోడ్డుపైకి వచ్చి ఏరుకోవడం కనిపించింది. మరోసారి ఇప్పుడు అదే తరహా ఘటన జరిగింది. ఇరుకు రహదారి, ఆపై మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే ఎంత నష్టం జరిగింది అనేది నిర్దిష్టంగా మాత్రం తెలియలేదు.
A vehicle loaded with #liquor bottles in cartons, went out of control and overturned in #Atchutapuram of #Anakapalli dist, #AndhraPradesh
Some #LiquorLovers were seen scrambling for bottles and leaving the spot with them.
This caused the traffic disruptions. pic.twitter.com/9MYsLRoZZy
— Surya Reddy (@jsuryareddy) June 24, 2025