New Liquor policy : ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలకు దరఖాస్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది.ఈనెల 11 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది.14న లాటరీ తీయనుంది.16 నుంచి కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపడుతోంది. అయితేతొలుత గడువు తేదీన నిర్ధారించిన 9వ తేదీ నాటికి..రాష్ట్రవ్యాప్తంగా 57,709 దరఖాస్తులు వచ్చాయి.దరఖాస్తు రుసుముతో 1154 కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు సమకూరింది.2017 మద్యం పాలసీతో పోలిస్తే ఆదాయం మూడు రేట్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.రేపటి వరకు గడువు ఉండడంతో దరఖాస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అయితే దరఖాస్తులు తగ్గడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలే కారణమని ఆరోపణలు వచ్చాయి.అనుకూల మీడియాలో సైతం ఇదే కథనాలు వచ్చాయి. దీంతో సీఎం చంద్రబాబు స్పందించారు.టెండర్లలో జోక్యం చేసుకుంటున్న నేతలకు హెచ్చరికలు జారీచేశారు.దీంతోదరఖాస్తులు ఊపందుకోవడం విశేషం.
* రూ.2000 కోట్ల ఆదాయం సమకూరేలా
రాష్ట్రవ్యాప్తంగా 3396 షాపులకు గాను..లక్ష దరఖాస్తులు వస్తాయనిప్రభుత్వం అంచనా వేసింది.నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో 2000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు భావించారు.అయితే చాలా ప్రాంతాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చాయి.కూటమి ప్రజాప్రతినిధుల జోక్యంతోనే దరఖాస్తులు తగ్గాయని ప్రచారం జరిగింది.దీంతో అటువంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది.దీంతో నేతల జోక్యం తగ్గింది.మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ మొదలైంది.
* చివరి మూడు రోజుల్లో
అయితే చివరి మూడు రోజుల్లో 37వేల దరఖాస్తులు రావడం విశేషం. రేపు సాయంత్రం వరకు గడువు ఉంది. దీంతో దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో మొదట్లో చాలా స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు అందాయి. దీనిపై ఎక్సైజ్ శాఖలోనూ ఆందోళన వ్యక్తం అయింది. నేరుగా సీఎంవో కార్యాలయం నుంచి సదరు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు రావడంతో వారు వెనక్కి తగినట్లు తెలుస్తోంది. అయితే ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లోనే అధికంగా దరఖాస్తులు రావడం విశేషం. 2017లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించింది. ఆ సమయంలో దరఖాస్తు రుసుముగా రూ. 25 వేలు, రూ. 50 వేలుగా ఉండేది.అప్పట్లో 76,329 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి 473 కోట్ల ఆదాయం సమకూరింది.ఇప్పుడు దానికి దాదాపు మూడు రెట్లు ఆదాయం పెరిగింది.అయితే ఇప్పటికీ చాలా జిల్లాల్లో దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి.