Exercise: వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మీకు తెలుసా?

ప్రస్తుతం చాలా మంది గుండె పోటుతో చనిపోతున్నారు. వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Written By: Kusuma Aggunna, Updated On : October 10, 2024 4:23 pm

Exercise

Follow us on

Exercise: వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది వాళ్ల బిజీ లైఫ్ వల్ల అసలు వ్యాయామం చేయడం లేదు. నిజం చెప్పాలంటే కనీసం శారీరక శ్రమ కూడా బాడీకి లేదు. డైలీ వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి చెందుతారు. ఈ రోజుల్లో అందరూ కూడా సుఖానికి అలవాటు పడి కనీసం శారీరకంగా వ్యాయామం కూడా చేయడం లేదు. ఎక్కువగా కూర్చోని ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. అసలు శారీరక శ్రమ లేని వాళ్లు, వ్యాయామం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే ఆ నష్టాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గుండె జబ్బుల ప్రమాదం
ప్రస్తుతం చాలా మంది గుండె పోటుతో చనిపోతున్నారు. వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో గుండె ప్రమాదాలు వచ్చే సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఎక్కువగా ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అసలు వారానికి కూడా వ్యాయామం చేయకపోతే గుండె సమస్యలు తప్పవు.

బరువు పెరగడం
శారీరక శ్రమ లేకుండా ఒకే చోటులో కూర్చొని ఉండటం వల్ల బరువు పెరుగుతారు. గంటల తరబడి ఆఫీసులో ఉద్యోగం చేయడం వల్ల అనేక వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కూర్చొని వర్క్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. అదే డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీకి శారీరక శ్రమ అంది ఆరోగ్యంగా ఉంటారు.

కండరాలు బలహీనంగా..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అదే చేయకపోతే ఎముకలు, కండరాలు అన్ని బలహీనంగా తయారవుతాయి. కండరాలు సమస్యలు కూడా అధికంగా వస్తాయి. సమయం లేకపోతే వీలు చూసుకుని అయిన వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడికి కారణం అవుతారు
వ్యక్తిగత కారణాలు, వర్క్ వల్ల చాలా మంది ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. ఏదైనా పనిలో నిమగ్నమైతే ఒత్తిడి నుంచి కాస్త విముక్తి చెందవచ్చు. బాగా ఆందోళనకు గురైన వారు చురుకుగా ఉండలేరు. వ్యాయామం చేయకపోవడం వల్ల ఒత్తిడికి గురై ఇంకా మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు.

మంచి నిద్ర
శారీరకంగా, మానసికంగా హాయిగా లేకపోతే నిద్ర కూడా పట్టదు. శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల బాడీ అలసిపోదు. దీంతో సరిగ్గా నిద్ర పట్టక ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. అదే కాస్త వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి నిద్ర కూడా పడుతుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.