Pak Vs Eng 1st Test: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్లు బ్రూక్ ట్రిబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. జో రూట్ డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ 823 రన్స్ చేయడం విశేషం. ఫలితంగా ముల్తాన్ టెస్టులో పాకిస్తాన్ జట్టు భవితవ్యం ప్రమాదంలో పడింది.. ఇంగ్లాండ్ బ్యాటర్ బ్రూక్ కేవలం 310 లోనే ట్రిబుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండవ అత్యంత వేగవంతమైన ట్రిబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడు మొత్తంగా 322 బంతులు ఎదుర్కొని 29 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 317 రన్స్ చేసి విలియం చేరుకున్నాడు. మరో స్టార్ ఆటగాడు రూట్ డబుల్ సెంచరీ చేశాడు. అతడు 375 బంతుల్లో 17 ఫొర్ల సహాయంతో 262 రన్స్ చేశాడు. టెస్టులలో ఇంగ్లాండ్ జట్టు తరుపున హైయెస్ట్ స్కోర్, హైయెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. అంతటితోనే ఆగకుండా రికార్డుల వేట సాగిస్తున్నాడు. బ్రూక్, రూట్ పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 453 రన్స్ జోడించారు. ఈ ఇద్దరు దూకుడైన బ్యాటింగ్ వల్ల ఇంగ్లాండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లకు 823 పరుగులు చేసి, డిక్లేర్ చేసింది. పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 556 రన్స్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 267 రన్స్ లీడ్ లభించింది.
ఆకాశమే హద్దుగా..
ముల్తాన్ టెస్టులో మూడోరోజు ఆటలో టెస్ట్ క్రికెట్లో 35వ సెంచరీ చేసి సునీల్ గవాస్కర్ రికార్డును రూట్ అధిగమించాడు. అయితే నాలుగు రోజు ఆటలో ఆ సెంచరీని డబుల్ గా మార్చాడు. ముల్తాన్ టెస్ట్ లో పాకిస్తాన్ జట్టుపై హ్యారిబ్రూక్ సత్తా చాటాడు. టెస్టుల్లో తొలిసారి ట్రిబుల్ సెంచరీ సాధించాడు. 2019లో డేవిడ్ వానర్ పాకిస్తాన్ జట్టు పై ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు టెస్ట్ క్రికెట్లో బ్రూక్ ట్రిబుల్ సెంచరీ చేసి.. సరికొత్త ఘనత అందుకున్నాడు.. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడుకు పాకిస్తాన్ బౌలర్లు నీరసించి పోయారు. ముఖ్యంగా పాకిస్తాన్ యువ బౌలర్ ఆఫ్రిది 26 ఓవర్లలో 120 పరుగులు ఇచ్చి.. కేవలం ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు 150 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో పాకిస్తాన్ బౌలర్లు డీలా పడిపోయారు. అంతకుముందు పాకిస్తాన్ లో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ క్రికెట్ ను ఆడింది. పాకిస్తాన్ జట్టును ఓడించి ట్రోఫీ.. దక్కించుకుంది.