Lagadapati Rajagopal Latest Photo: అలాంటి లగడపాటి రాజగోపాల్.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. రాజకీయాలకు దూరమయ్యారు. వ్యాపారాలు కూడా నష్టాల్లో ఉండడంతో కొన్నింటిని కష్టమైన సరే అమ్మేశారు. ఆ తర్వాత కొన్ని వివాదాలలో చిక్కుకున్నారు. కొద్ది రోజులకు వాటి నుంచి కూడా బయటపడ్డారు. రాజకీయ వైరాగ్యంతో చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్నారు. కొద్దిరోజులు విదేశాలలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కువకాలం కుటుంబంతో.. ఇతర వ్యవహారాలతో బిజీ బిజీగా ఉన్నారు. అలాంటి లగడపాటి రాజగోపాల్ ఒక్కసారి మీడియాలో కనిపించారు. 2018లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక సంచలన సర్వేతో ఆయన ముందుకు వచ్చారు. ఆ సర్వే ఫలితాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చెప్పడంతో ఒక్కగా ఇక్కడ పరిస్థితి మారిపోయింది. అదే కాదు అప్పటి అధికార భారత రాష్ట్ర సమితికి ఆ సర్వే ఫలితం వ్యతిరేకంగా ఉండడంతో.. దానిని ఆ పార్టీ మరో విధంగా మార్చేసింది. తెలంగాణ సెంటిమెంట్ రగిలించేసింది. దీంతో భారత రాష్ట్ర సమితి ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించి.. రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఫలితంగా లగడపాటి సర్వే తప్పుల తడక అయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆయన మరోసారి తాను సర్వే చేయనని స్పష్టం చేశారు.. ఇక అప్పటినుంచి పరోక్ష రాజకీయాలలో కూడా ఆయన పేరు వినిపించలేదు. ఆయన రూపు కనిపించలేదు.
Also Read: నిరుటి కమిషన్ కే దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా పేపర్ టార్గెట్లా?
ఇన్నాళ్లకు లగడపాటి రాజగోపాల్ ఒక్కసారిగా దర్శనమిచ్చారు. మీడియాలో కనిపించారు. కాకపోతే సోషల్ మీడియాలో కనిపించిన ఆయన ఫోటోను మీడియా తెగ ప్రసారం చేస్తోంది. కిచెన్లో ఉన్న ఆయన. ఏదో హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్ని ప్లేట్లో వేసుకొని తింటున్నారు . హోటల్ నుంచి వచ్చిన పార్సిల్స్ విప్పుకుంటూ.. అందులో ఉన్న ఆహారాన్ని ప్లేట్లో వేసుకుంటూ తినడానికి ప్రయత్నిస్తున్నారు.. అందులో చపాతీలు, కొన్ని రకాల సాంబార్లు, పచ్చళ్ళు, గడ్డ పెరుగు వంటివి కనిపిస్తున్నాయి. బహుశా ఈ దృశాన్ని రాజగోపాల్ సతీమణి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజగోపాల్ ఒకప్పటితో పోల్చి చూస్తే మరింత సన్నగా మారిపోయారు. ఒకరకంగా యువకుడి లాగా కనిపిస్తున్నారు. రాజగోపాల్ ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన సారథ్యంలో నడిచిన లాంకో కంపెనీలో కొంత వాటాను వేరే వారికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు లగడపాటి శ్రీధర్ చిత్ర నిర్మాతగా రాణించారు. కొన్ని సినిమాలు కూడా నిర్మించారు.. చాలా రోజుల తర్వాత లగడపాటి రాజగోపాల్ ఇలా కనిపించడంతో కొంతమంది నెగటివ్ గా.. ఇంకొంతమంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తుండడం విశేషం.
Also Read: కూటమి ఏడాది పాలన.. సర్వేలో సంచలన అంశాలు