1 Year of Chandrababus Government: ఇటీవలే కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న ప్రభుత్వం కొలువుదీరింది. సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పాలనలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి కొంత సమయం పడుతుంది. కానీ చంద్రబాబు రూపంలో సీనియర్ నేత ఉండడంతో.. తక్కువ రోజుల్లోనే పాలన గాడిలో పడింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. ఏడాది పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇటీవల ప్రభుత్వం ఐవిఆర్ఎస్, సి ఎస్ డి ఎస్ పద్ధతిలో చేయించుకున్న సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అవినీతి నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించడం సంచలనం రేపుతోంది. అవినీతిని సహించేది లేదని హెచ్చరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
అవినీతిపై మాత్రం అసంతృప్తి..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా( NTR Bharosa) పింఛన్లు పెంచి అందించిన విషయం విధితమే. అన్న క్యాంటీన్ల సేవలు ప్రారంభం, ఆసుపత్రుల్లో సేవలు మెరుగు, విద్యావ్యవస్థలో మార్పులు, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పనితీరుపై మాత్రం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కొన్ని అంశాల్లో మరింత మెరుగుదల అవసరమని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కానీ మొత్తం ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల పనితీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అవినీతి విషయంలో మాత్రం అసంతృప్తితో ఉన్నారు.
Also Read: AP Kutami Government: ఏడాది కూటమి పాలన.. వచ్చే నాలుగేళ్లలో జరిగేది అదే!
గత ప్రభుత్వం మాదిరిగా అవినీతి కొనసాగుతోందని ఎక్కువ మంది చెప్పడం విశేషం. పింఛన్ల పంపిణీలు అవినీతి లేదంటూ 85 శాతం మంది చెప్తే.. పింఛన్లు ఇంటి వద్దే ఇస్తుండడంపై 87.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రవర్తన కూడా బాగుందంటూ 83.9 శాతం మంది తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అన్నా క్యాంటీన్లలో ఆహార నాణ్యత బాగుందంటూ 80 శాతం మంది తమ సంతృప్తిని వ్యక్తం చేశారు.
తల్లికి వందనంతో సంతృప్తి..
అయితే నిన్నటి వరకు ఒక ఎత్తు.. నిన్నటి నుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంది ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి శాతం. సూపర్ సిక్స్( super six ) పథకాల్లో ప్రధానమైనదిగా భావిస్తున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేశారు. దీంతో ప్రజల్లో సంతృప్తి శాతం ప్రారంభం అయింది. విపక్షాల విమర్శలకు కూడా చె క్ పడింది. మరోవైపు ఇదే నెలలో అన్నదాతకు సుఖీభవ పథకం కూడా అమలు చేయనున్నారు.
Also Read: Andhra Pradesh : కూటమిలో చిచ్చు.. ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు.. ఇలా అయితే కష్టం!
దీంతో కీలకమైన పథకాలకు సంబంధించి ప్రజల్లో మరింత సంతృప్తి శాతం పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ప్రారంభం కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం మారుతూ వస్తుండడం గమనార్హం. ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజల్లో సానుకూలత పెంచాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికైతే ఏపీలో కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి ప్రారంభం కావడం విశేషం.