KTR Following Jagan: తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ, బిఆర్ఎస్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. 2023 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ఓడిపోయింది. అక్కడికి ఏడాది తిరిగేసరికి ఏపీలో అధికారాన్ని కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ రెండు పార్టీలకు చాలా విషయాల్లో సారూప్యత ఉంది. ప్రత్యేక రాష్ట్రం సెంటిమెంట్తో కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. తండ్రి వారసత్వంగా తనకు సీఎం పదవి ఇవ్వలేదని భావించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తండ్రి పేరుతో పార్టీ పెట్టి అధికారంలోకి రాగలిగారు. అయితే ఈ ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు. అందుకే రాజకీయంగా నేరుగా కలవకపోయినా.. పరస్పర రాజకీయ ప్రయోజనాలకు మాత్రం ఇద్దరూ పాకులాడారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ఓడిపోయాయి. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పుడు మరో సారూప్యతతో ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో కానీ.. ఇండియా కూటమిలో కానీ.. ఈ రెండు పార్టీలు లేకపోవడం విశేషం.
Also Read: సమస్యల సుడిగుండంలో కేసీఆర్
ఇద్దరిదీ ఒకే అభిప్రాయం..
అయితే తాజాగా జగన్ వాదనతో ఏకీభవించారు కేటీఆర్( KTR). మొన్న ఆ మధ్యన ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో అర్థం కావడం లేదని మాట్లాడారు కేటీఆర్. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే తమ విజయానికి బ్రేక్ వేసింది రాజకీయ ప్రత్యర్థులు కారు అన్నది ఈ ఇద్దరు యువనేతల అభిప్రాయం. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. టిడిపి కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించింది. దారుణ పరాజయాన్ని ఊహించని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషన్ వద్ద తమ వాదనలను వినిపిస్తున్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తేవాలన్న డిమాండ్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే డిమాండ్ చేశారు కేటీఆర్.
Also Read: మార్గదర్శి మీద ఉండవల్లి కేసు ఎందుకు కొట్టేసింది? ఏంటా తీర్పు?
కాంగ్రెస్ నేత రాహుల్ సైతం
తాజాగా భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈవీఎంలపై తన వాదనలు వినిపించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు రావాలని డిమాండ్ చేశారు. అప్పుడే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందన్నారు. అయితే ఇప్పటికే తోటి దాయాది రాష్ట్రంలోని తమ స్నేహితుడైన జగన్ ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహా డిమాండ్ ను చేశారు కేటీఆర్. అయితే లోక్సభ తో పాటు జాతీయస్థాయిలో దీనిపై గట్టిగానే మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. కానీ ఆయనతో ఏకీభవించే అవకాశం ఈ ఇద్దరు నేతలకు లేదు. ఎందుకంటే తెలంగాణలో తమకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉందన్న విషయం కేటీఆర్ కు తెలుసు. కాంగ్రెస్ను విభేదించిన జగన్మోహన్ రెడ్డి సైతం రాహుల్ గాంధీకి జై కొట్టే ఛాన్స్ లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి తో పాటు కేటీఆర్ ఇప్పుడు ఈవీఎంలపై యుద్ధం చేస్తారన్నమాట. అయితే వారు గెలిచేటప్పుడు ఈవీఎంల పనితీరుపై ఎటువంటి అనుమానాలు ఉండడం లేదు. ఓడిపోయేటప్పుడు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు అలానే చేస్తుండడం విశేషం.