Andhra Pradesh GST Growth: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ప్రయత్నాలు ఫలించాయి. సంపద సృష్టిస్తానన్న ఆయన మాట ఇప్పుడిప్పుడే నిజం అవుతుంది. గత ఏడాదిగా ఆదాయం పెంపొందించుకునేందుకుగాను ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. అవి ఎట్టకేలకు సఫలం అయినట్లు కనిపిస్తున్నాయి. జూలై నెలలు జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ దుమ్ము రేపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఒక్క జూలై నెలలో భారీగా రాబడి రాబెట్టింది ఏపీ ప్రభుత్వం. జీఎస్టీ వార్షిక వృద్ధిరేటులో దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. ఇదే విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు మంత్రి నారా లోకేష్. ఏపీ ప్రభుత్వం సాధించిన ఘనత పై ఆనందం వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా..
దేశవ్యాప్తంగా జిఎస్టి( GST) 2017లో అమల్లోకి వచ్చింది. అయితే గతంలో ఏపీ ఎన్నడూ లేని విధంగా ఒక్క జూలైలోనే భారీ స్థాయిలో రాబడి వచ్చింది ప్రభుత్వానికి . ఏకంగా ఆ ఒక్క నెలలోనే రూ.3803 కోట్ల జిఎస్టి వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఏపీ వార్షిక వృద్ధి 14 శాతం గా ఉంది. ఇది దక్షిణ భారత రాష్ట్రాలలోనే అత్యధిక జీఎస్టీ వృద్ధిరేటు. అలాగే దేశంలోని పెద్ద రాష్ట్రాలలో మూడోది. 2018 నుంచి 2025 వరకు జీఎస్టీ స్థూల వసూళ్లు రూ. 3,803 కోట్లు రావడం ఇదే తొలిసారి. అలాగే నికర జీఎస్టీ వసూళ్లు కూడా రూ.2930 కోట్లు సాధించడం ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ఆదిత్యం. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీనిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా 14% వృద్ధితో ఎగువకు దూసుకు వెళ్లడం చిన్న విషయం కాదు.
Also Read: జగన్ రూట్ లోనే కేటీఆర్.. ఏంటి కథ?
ఇదో రికార్డ్..
2024 జూలై నెల తో పోలిస్తే 2025 జూలై నెలలో దక్షిణాది రాష్ట్రాలలో జీఎస్టీ అత్యధిక వృద్ధిరేటు ఏపీ నమోదు చేసుకుంది. 2024 జూలైలో ఏపీ రూ.3346 కోట్లు జీఎస్టీ వసూలు చేసింది. కానీ ఈ ఏడాది జూలైకి వచ్చేసరికి ఏకంగా రూ.3803 కోట్లు సాధించడం అనేది సాధారణ విషయం కాదు. వార్షిక వృద్ధిరేటు 14% నమోదు అయ్యింది. అయితే పక్క దాయాది రాష్ట్రం విషయానికి వస్తే.. 2024 జూలైలో తెలంగాణ ప్రభుత్వం రూ.4940 కోట్లు జీఎస్టీ రూపంలో సాధించగా.. 2025 జూలైలో రూ.5417 కోట్లు రాబడి రాబెట్టింది. అయితే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది తెలంగాణ. అయినా సరే 10% వార్షిక వృద్ధిరేటు మాత్రమే సాధించింది. తెలంగాణతో పోల్చితే ఏపీ మాత్రం 14% వృద్ధిరేటు సాధించడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏపీ ఈజ్ బ్యాక్ అంటూ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థికంగా బలంగా పుంజుకుంటుందని.. బలమైన ఆర్థిక పునరుద్ధరణకు ఇదే మంచి ప్రయత్నం అంటూ పేర్కొన్నారు నారా లోకేష్.