Homeఆంధ్రప్రదేశ్‌KS Prasad Sakshi Channel: కేఎస్ ప్రసాద్ సాక్షి ఛానల్ కు వెళ్ళడట.. చివరికి మీరు...

KS Prasad Sakshi Channel: కేఎస్ ప్రసాద్ సాక్షి ఛానల్ కు వెళ్ళడట.. చివరికి మీరు కూడా ఇలా చేస్తే జగన్ పరిస్థితి ఏంటి..

KS Prasad Sakshi Channel: తెలుగులో న్యూట్రల్ మీడియా అనేది లేదు. ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీ పత్రిక లేదా ఛానల్ నిర్వహిస్తోంది. ఇక సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్స్ అయితే బీభత్సం. ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో విశ్లేషకులుగా వెళ్లేవారు కూడా అనధికారికంగా పార్టీ కార్యకర్తలే. కాకపోతే వారు మేధావుల ముసుగు వేసుకుంటారు. అంతిమంగా తమ అభిప్రాయాన్ని జనాల అభిప్రాయంగా చెబుతూ.. పార్టీలకు పరోక్షంగా ఉపయోగపడుతుంటారు.

తెలుగులో సాక్షి ఛానల్ వైసిపికి అనుబంధం మీడియా. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా సాక్షి ఛానల్ జగన్ కు డప్పు కొడుతూనే ఉంది. ఈ ఛానల్ లో నిర్వహించే డిబేట్ లలో కొంతమంది విశ్లేషకుల ముసుగు వేసుకున్న పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. వారంతా కూడా జగన్ భజన చేస్తూ ఉంటారు. అంతేకాదు టిడిపి మీద.. అవకాశం దొరికితే పవన్ కళ్యాణ్ మీద.. ఇంకా రకరకాల వ్యక్తుల మీద బురద చల్లుతూనే ఉంటారు. జనాల అభిప్రాయం పేరు చెప్పి.. తమ సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. సాక్షి మాత్రమే కాదు.. తెలుగులో ఉన్న అన్ని చానల్స్ లో పరిస్థితి దాదాపు ఇలానే ఉంటుంది.

ఇటీవల ఏపీ రాజధాని గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ ప్రాంతాన్ని ఏపీ రాష్ట్రానికి రాజధాని చేయాలని సరికొత్త డిమాండ్ తీసుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ ప్రతిపాదన సాక్షి ఛానల్ లోకి వెళ్లే విశ్లేషకులకే నచ్చలేదు. దీంతో వారు మావిగన్ ప్రతిపాదనపై మొహమాటం లేకుండా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని.. జగన్ ఆలోచించుకోవాలని సూచించారు. ఆ తర్వాత సాక్షి ఛానల్ లో ఆ విశ్లేషకులు కనిపించడం మానేశారు. అందులో ప్రముఖమైన విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్.. 2024 ఎన్నికల్లో జగన్ ఏపీలో మరొకసారి అధికారంలోకి రాకపోతే తనకు కర్మ చేయాలని.. ఆ భోజనాన్ని పదిమందికి పెట్టాలని ముందుగానే డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కేఎస్ ప్రసాద్. వైసిపి ఓడిపోయిన తర్వాత.. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన తర్వాత కేఎస్ ప్రసాద్ కొద్ది రోజులపాటు మీడియాలో కనిపించలేదు. ఆ తర్వాత సాక్షి ఛానల్ లో ప్రత్యక్షమయ్యారు. కేస్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యల పట్ల టిడిపి, జనసేన నాయకులు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేశారు.. మావిగన్ ప్రతిపాదన నేపథ్యంలో కేఎస్ ప్రసాద్ జగన్ నిర్ణయాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు. ఆ తర్వాత ఆయనకు సాక్షి డోర్లు మూసుకుపోయాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తను సాక్షిలో డిబేట్ లకు వెళ్ళబోనని ప్రసాదు స్పష్టం చేశారు. ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. టిడిపి నేతలు మరో విధంగా స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు కష్టకాలంలో జగన్ ఉన్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతో కొంత డప్పు కొట్టాల్సిన కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు దూరం కావడం బాధాకరం. అసలు ఇలాంటి పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుందో అర్థం కావడంలేదని.. టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version