spot_img
Homeజాతీయ వార్తలుBJP Dominance India: బెంగాల్లో పాగా.. 17 రాష్ట్రాలు, 72% జనాభా.. బిజెపి రేంజ్ అర్థమవుతోందా...

BJP Dominance India: బెంగాల్లో పాగా.. 17 రాష్ట్రాలు, 72% జనాభా.. బిజెపి రేంజ్ అర్థమవుతోందా రాహుల్..

BJP Dominance India: నిన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో బిజెపి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.. అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.. పుదుచ్చేరి ప్రాంతంలో కాషాయ జెండాను ఎగరవేసింది.. తద్వారా దేశ రాజకీయాలలో తన పట్టు మరొకసారి నిలుపుకుంది భారతీయ జనతా పార్టీ.

2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించింది. బిజెపికి సొంతంగా అధికారంలోకి వచ్చే స్థాయి దక్కకుండా చేసింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని.. దేశవ్యాప్తంగా జోరు చూపిస్తున్న బిజెపికి బ్రేక్ వేస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ సత్తా 2024 ఎన్నికల వరకే ఆగిపోయిందని బిజెపి నిరూపించింది. ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో బిజెపి వరుసగా విజయాలు సాధించుకుంటూ వస్తోంది.. అస్సాం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన కమలం పార్టీ.. ఇప్పుడు 2018 నాటి సీన్ రిపీట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాదాపు 70 శాతానికి పైగా బీజేపీ, అన్ని మిత్ర పక్షాల పరిపాలన సాగుతోంది.. దేశంలో మొత్తం 29 రాష్ట్రాలకు (హస్తినతో సహా) గానూ 16 చోట్ల బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో సాధించిన విజయంతో ఈ సంఖ్య 17 చేరింది. ఇంకా నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కూటమి పరిపాలన సాగిస్తోంది. కేవలం ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే ప్రతిపక్షాలు పరిపాలన సాగిస్తున్నాయి.

బిజెపి నాయకత్వంలో పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గుజరాత్, గోవా, ఢిల్లీ, చత్తీస్గడ్, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

బిజెపి ఆదరిత ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, సిక్కిం, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, మేఘాలయలో ఎన్సిపి, నాగాలాండ్ లో ఎన్ డి పిపి, సిక్కిం లో ఎస్కేయం, పుదుచ్చేరిలో ఏ ఐ ఎన్ ఆర్ సి లో బిజెపి భాగస్వామ్య పార్టీగా ఉంది.

తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం ఉంది.. పంజాబ్ లో ఆప్, జార్ఖండ్లో జేఎంఎం, మిజోరాం లో జెడ్పిఎమ్ పార్టీలు పరిపాలన సాగిస్తున్నాయి. 2018లో బిజెపి ఇలానే దూకుడు కొనసాగించింది.. ఇప్పుడు కూడా బిజెపి అదే హవా కొనసాగిస్తోంది. ఇది ఒక రకంగా రాహుల్ గాంధీ కి సంధి కాలం లాంటిది. దీనిని ఆయన ఏవిధంగా అధిగమిస్తారనేది చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version