Kinjarapu Ram Mohan Naidu: టిడిపి యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు( Kinjarapur Ram Mohan Naidu) మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. చిన్న వయసులోనే పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆయన వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ వారం యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 50 దేశాల నుంచి 116 మందిని ఎంపిక చేయగా.. ఇండియా నుంచి రామ్మోహన్ నాయుడు తో పాటు మరో ఆరుగురికి గౌరవం దక్కింది. సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గతంలో చాలాసార్లు రామ్మోహన్ నాయుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో తనకంటూ ముద్ర చాటుకున్నారు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈ స్థాయి సాధించడం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: ఏపీలో ఉపాధ్యాయుల కష్టాలకు లోకేష్ చెక్.. కొత్తగా ఆ యాప్!
* యువతకు గుర్తించి..
40 ఏళ్లలోపు వయస్సు ఉండి.. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన యువకులకు ఈ అవార్డు ఇస్తారు. ప్రపంచ అభివృద్ధికి కృషి చేసినందుకు వారిని గౌరవిస్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు ఇండియా నుంచి మరో ఆరుగురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం( world economic forum ) అనేది ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఇది స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది. ఏటా ఈ సమస్త అవార్డులను ప్రదానం చేస్తుంది. 50 దేశాల నుంచి 116 మందికి ఇవ్వగా.. అందులో భారతీయులు ఆరుగురు ఉన్నారు.
* ఆ ఆరుగురికి చోటు..
కింజరాపు రామ్మోహన్ నాయుడు భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు.నిప్మా న్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిపుల్ మల్హోత్రా, పెంగ్విన్ రాండం హౌస్ ఇండియాలో చీఫ్ ఎడిటర్ మానసి సుబ్రహ్మణ్యం, నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు అలోక్ మేడికేపుర అనిల్, ప్రముఖ పర్వతారోహకుడు అనురాగ్ మాలూ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నటరాజన్ శంకర్, oyo హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఈ జాబితాలో ఉన్నారు.
* చంద్రబాబు అభినందనలు..
కాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు అవార్డు రావడం పై టీడీపీ అధినేత చంద్రబాబు( CM Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం దేశానికి, తెలుగు సమాజానికి గర్వకారణం అని కొనియాడారు. ప్రజాసేవ పట్ల రామ్మోహన్ చూపిస్తున్న అంకితభావం మన దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Also Read: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల పెంపు!