https://oktelugu.com/

Tirumala: తిరుమలలో బాలుడి కిడ్నాప్‌.. ఛేదించిన పోలీసులు.. కారణం తెలిసి షాక్‌!

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చెందిన నగేశ్‌–పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు అక్షయ్‌కి ఆరేళ్లు. చిన్న కొడుకు అభినయ్‌కు మూడేళ్లు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. వసతి గది దొరకకపోవడంతో పీఏసీ2లో సేద తీరారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 11, 2024 / 12:59 PM IST

    Tirumala

    Follow us on

    Tirumala: దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల. నిత్యం వేలాది మంది వచ్చే తిరుమలలో భద్రత కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. నిరంతరం నిఘా నీడలో ఉండే తిరుమలలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్‌ అయ్యాడు. 24 గంటల్లోనే కిడ్నాప్‌ను పోలీసులు ఛేదించారు. ఇందుకు కారణమైన మహిళను అరెస్ట్‌ చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. అయితే అరెస్ట్‌ అయిన మహిళ కిడ్నాప్‌ గురించి చెప్పిన కారణాలు విని పోలీసులు షాక్‌ అయ్యారు.

    ఏం జరిగిందంటే..
    తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజకు చెందిన నగేశ్‌–పరిమళ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు అక్షయ్‌కి ఆరేళ్లు. చిన్న కొడుకు అభినయ్‌కు మూడేళ్లు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. వసతి గది దొరకకపోవడంతో పీఏసీ2లో సేద తీరారు.

    ఆడిస్తూ అపహరించింది..
    తిరుమలకు వచ్చిన తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన ఇజ్జాడ దేవి అక్కడే ఉంది. అభినయ్‌ను ఫోన్‌లో ఆడిస్తూ తల్లిదండ్రుల కళ్లుగప్పి బాలుడిని అక్కడి నుంచి కిడ్నాప్‌ చేసింది. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో బిడ్డ కనిపించడం లేదని గుర్తించిన నగేశ్, పరిమళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    24 గంటల్లో ఛేదించిన పోలీసులు..
    కిడ్నాప్‌ చేసిన బాలుడిని జీపులో తిరుపతికి తీసుకువచ్చింది దేవి. అక్కడ నుంచి సంధ్య థియయేటర్‌ రోడ్‌లోకి వెళ్లి అక్కడ ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఆవుల ప్రభాకర్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లింది. అక్కడ గది అద్దెకు కావాలని అడిగింది. ప్రభాకర్‌యాదవ్‌ అద్దె గదులు లేవని చెప్పడంతో మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

    వాట్సాప్‌లో చూసి..
    తర్వాత కాసేపటికే ఆర్టీసీ డిపో మేనేజర్‌ ద్వారా వాట్సాప్‌ గ్రూపలో బాలుడి కిడ్నాప్‌ వివరాలు చూసిన ప్రభాకర్‌ దేవి వెంట ఉన్న బాలుడి గుర్తుపల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దేవి పెద్దకాపు లేఔట్‌లోని లాడ్జిలో ఉన్నట్లు అనుమానించారు. ఆ ఏరియాలో గాలింపు చేపట్టి మహిళను పట్టుకుని బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

    మగ సంతానం లేదని..
    తర్వాత పోలీసులు దేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. సందర్భంగా ఆమె చెప్పిన కారణాలు విని పోలీసులు షాక్‌ అయ్యారు. తనకు మగ సంతానం లేదని బాలుడిని పెంచుకోవాలని కిడ్నాప్‌ చేసినట్లు తెలిపింది. అయితే దేవి బాలుడిని మరో వ్యక్తికి ఇవ్వడానికి యత్నించిందని, అతను రావడం ఆలస్యం కావడంతో పట్టుపడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.